వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ జయంతిన మద్యం అమ్మకాలు, సీఎం తీరు ఎవరికి అర్థం కావడం లేదన్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

జాతిపిత మహాత్మ గాంధీ జయంతి రోజున ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలు ఎలాంటీ సందేశాలు ఇవ్వాలని భావిస్తున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. చట్టాలను గౌరవించకుండా పోలీసులను పెట్టి మద్యం అమ్మకాలు చేపట్టడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం బ్రిటీష్ వారైన దేశ చట్టాలను గౌరవించి వాటిని అనుసరించేవారని అన్నారు.కాని జగన్ మోహన్‌రెడ్డి చట్టాలను గౌరవించడం లేదని విమర్శలు చేశారు.

టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు ... వైసీపీ సోషల్ మీడియాపై వర్ల రామయ్య ఫిర్యాదు .. టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు ... వైసీపీ సోషల్ మీడియాపై వర్ల రామయ్య ఫిర్యాదు ..

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేసిన చంద్రబాబు రాష్ట్రం ఆయన స్వంత జాగీరు కాదని అన్నారు. మరోవైపు జగన్ మోహన్‌రెడ్డి ఎవరి ఉహలకు అందకుండా అర్థంకాని రీతిలో ఆయన వ్యవహారశైలి ఉందని అన్నారు. చట్టాలను తనకు ఇష్టం వచ్చిన విధంగా మార్చుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేశారని, ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని చెప్పారు.

TDP president chandrababu naidu criticises cm jaganmohan reddy of liquor sell

మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం 2003లోనే తీసుకువచ్చిందని చెప్పిన ఆయన, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిందేమి లేదని పేర్కోన్నారు. ఇక 11 కేసులున్న సీఎం తానే నీతుమంతుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. మిగతా వారంతా అవినీతీపరులే అనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు.

English summary
TDP president chandrababu naidu criticises cm jaganmohan reddy of liquor sell on Gandhi Jayanti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X