కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్ లోకి వచ్చి పడిన 17కోట్లు..!
ఏపీలో అధికార కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. పార్టీ నిర్మాణం పరంగానే కాకుండా ఆర్ధికంగానూ బలపడే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి ఇవాళ కడపలో ప్రారంభమైన మహానాడు వేదికగా మారుతోంది.
తెలుగు తమ్ముళ్లకు పసుపు పండుగ అయిన టీడీపీ మహానాడును వైఎస్ కుటుంబ అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ కంచుకోటల్ని కుప్పకూల్చిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు మహానాడుకు భారీ ఎత్తున తరలివెళ్లాయి. అదే సమయంలో టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.17 కోట్లు వచ్చిపడ్డాయి. మహానాడు సందర్భంగా పార్టీకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కడప మహానాడులో టీడీపీకి భారీ విరాళాలు అందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహానాడు వేళ కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా రూ.17 కోట్ల విరాళాలు అందినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలా విరాళాలు అందించిన వారిలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ విరాళాన్ని పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు మహానాడు వేదికగానే ప్రకటించారు. ఇప్పటికే 45 రోజుల వ్యవధిలోనే కోటి మంది సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించిన టీడీపీ వారి సంక్షేమం కోసం 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది.












Click it and Unblock the Notifications