రక్తకన్నీరు సినిమాలో నాగభూషణంలా: జగన్‌పై దూళిపాళ్ల నరేంద్ర
గుంటూరు/ ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రక్తకన్నీరు సినిమాలోని నాగభూషణం కన్నా మిన్నగా నటిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన గుంటూరులో శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారపు. దీక్ష చేసే హక్కు జగన్‌కు లేదన్నారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ లోటస్‌పాండ్ అని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో 110మంది టీడీపీ కార్యకర్తలను హత్యచేశారన్నారు. రక్షణ లేకుండా బయటకు అడుగుపెట్టలేని జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని నరేంద్ర అన్నారు.

ల్యాండ్, వైన్, మైన్, ఏటీఎం, శాండ్, రెడ్‌శాండిల్ దొంగల ముఠాకు నేత వైయస్ జగన్ జగన్ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్రంగా విమర్శించారు. ఆస్తుల పరిరక్షణకు సీమాంధ్ర ప్రయోజనాలను గాలికొదిలి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జగన్ చేతులు కలిపారని మంత్రి ఆరోపించారు.
నోటుకు ఓటు వ్యవహారంలో తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు వెనక కెసిఆర్, జగన్ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. కెసిఆర్‌తో కలిసి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్సించారు. వైయస్సార్ కాంగ్రెసు దొంగల పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో చేరేందుకు మరో దొంగ వస్తున్నాడని ఆయన బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications