గీతాంజలి మృతిపై బయటపడ్డ సంచలన వీడియో

ఏపీ రాజకీయాలు మొత్తం కూడా గీతాంజలి మరణం చూట్టునే తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మరణించిందని అధికార వైసీపీ ఆరోపిస్తుంటే.. ఆమె మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ , జనసేన పార్టీలు చెబుతున్నాయి. దీంతో గీతాంజలి మరణంరాజకీయ రంగు పులుముకుంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ మీడియా సజ్జల భార్గవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

గీతాంజలి మృతిపై టీడీపీ , జనసేన వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల చనిపోయిందనే బాధ లేకుండా తిరిగి తమ మీదనే ఆరోపణలు చేయడం సిగ్గుచేటని సజ్జల భార్గవరెడ్డి తెలిపారు. ఇలాంటి నీచపు ఆలోచనలు చంద్రబాబుకు ఉంటాయని ఆయన దుయ్యపట్టారు. ఇదిలా ఉంటే గీతాంజలి మృతిపై సంచలన వీడియోను తెలుగు దేశం పార్టీ తమ అధికారిక ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Tdp shares Sensational video on Geetanjali s death

వీడియోలోని వ్యక్తులు మాట్లాడుకుంటూ ''ఏమైంది..ఎవరో అమ్మాయిని రైలు కింద నెట్టేశారు. అవునా బ్రతికే ఉందా .. ఏమో తెలియదు. ఆమెను ఎవరు రైలు కిందకు తోసేశారు..? ఏమో తెలియదు ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు నెట్టి పారిపోయారని'' చర్చించుకోవడం ఈ వీడియోలో వినిపించింది. గీతాంజలి రైలు కింద పడే సమయంలో అక్కడున్న వారు ఈ వీడియో తీసినట్టు స్పష్టం అవుతుంది.

తాజాగా ఈ వీడియోను టీడీపీ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...గీతాంజలిని ఎవరు తోసేశారు..? ఆమె మరణానికి వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది గీతాంజలినా కాదా అనేది తెలియాల్సి ఉంది. వీడియోలో చనిపోయిన మహిళ మొహాన్ని స్పష్టంగా చూపించకపోవడంతో, ఇందులో ఉన్నది గీతాంజలియేనా కాదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై అధికార వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+