ఆత్మరక్షణలో చంద్రబాబు!, కేవీపీ బిల్లుకు మద్దతు: ఏమైనా జరగొచ్చు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు తాము మద్దతు పలుకుతామని తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ప్రకటించింది. ఈ నెల 22న ఈ బిల్లు చర్చకు వస్తుంది.

చంద్రబాబును ఆ మాట అనడం జగన్ తప్పిదం, ప్రతి ఏడాది వస్తాయా'

ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందు టిడిపి నేత బోండా ఉమ ప్రకటన చేశారు. కేవీపీ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుతో ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే దేనికైనా టిడిపి సిద్ధమని, అందుకే బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు.

బాబు ఇరుకున పడ్డారా?

కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా జాతీయ స్థాయిలో పలు పార్టీలు మద్దతు పలకనున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస కూడా మద్దతు ఇస్తామని చెప్పింది.

TDP To Support KVP Bill On Special Status

మద్దతు విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉన్నప్పటికీ.. ఇతర పార్టీలు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో టిడిపి ఇరుకున పడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. దీంతో, కేవీపీ బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేవీపీ బిల్లు పైన కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేయనుంది.

ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఉత్కంఠ: ఏకగ్రీవం అంటూ అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ

మరోవైపు, అసలు కేవీపీ బిల్లు చర్చకు వస్తుందా అనే అనుమానాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లు చర్చకు రాకపోవచ్చునని అన్నారు.

కేవీపీ ఎఫెక్ట్, బాబుని ఇరికిస్తున్న కేసీఆర్: వెంకయ్య చక్రం!

బిల్లు చర్చకు వస్తుందా అని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేయడం, బిల్లుకు మద్దతు పలుకుతామని బీజేపీ మిత్రపక్షం టిడిపి చెప్పడం నేపథ్యంలో.. బీజేపీ చెప్పినట్లుగా చర్చ లేదా ఓటింగుకు వస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. ఒకవేళ చర్చకు, ఓటింగుకు వస్తే కేవీపీ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా మోడీకి బాబు షాకిస్తారని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party to support KVP Ramachandra Rao's Bill On Special Status to AP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి