కొడాలి నాని కనుసన్నల్లో 4 వేల కోట్ల రేషన్ బియ్యం దందా ; టార్గెట్ చేస్తున్న టీడీపీ .. జగన్ కు సూటి ప్రశ్న !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నిరంతరం సమరం కొనసాగుతూనే ఉంది. అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వైసిపి, టిడిపి నాయకులు నిరంతరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా టిడిపి నేతలు మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు మొదలుపెట్టారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే నాలుగువేల కోట్ల బియ్యం కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని టార్గెట్ చేసింది.

బియ్యం కుంభకోణంలో జగన్ ఏం చర్యలు తీసుకుంటారు ..దేవినేని ఉమా ట్వీట్
ఈ మేరకు మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ను ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మైలవరంలో యధేచ్చగా పేదవాడి రేషన్ బియ్యం దోపిడీ జరుగుతోందని మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు . అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని, తక్కువ ధరకు పేదవాడికి ఇచ్చే రేషన్ బియ్యం కొనుగోలు చేసి, రీసైకిల్ చేసి మళ్లీ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారని, నాణ్యమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేతలతో కుమ్మక్కై పేదవాడి బియ్యం దోపిడీ చేస్తున్న మీ ప్రజాప్రతినిధుల అవినీతిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని దేవినేని ఉమా ప్రశ్నించారు.

మంత్రులు కొడాలి నాని, శ్రీ రంగనాథ రాజులను టార్గెట్ చేసిన టీడీపీ
రైస్ మిల్ లను తనిఖీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు ఎవరి ఆదేశాలతో పని చేస్తున్నారంటూ దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. మొత్తానికి పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని శాఖను టార్గెట్ చేసి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా విపరీతంగా పెరిగిపోయిందని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని సేకరించి, రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికి దానిని విక్రయిస్తున్నారని, ఇదంతా మంత్రులు కొడాలి నాని, శ్రీరంగ నాథరాజుల కనుసన్నల్లో జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు విమర్శించారు.

నాలుగు వేళా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణ
దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు దర్యాప్తు చేయించరో చెప్పాలని ప్రశ్నించారు. ఇందులో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ముడుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇటీవల మైలవరంలో రైసు మిల్లులలో వెలుగులోకి వస్తున్న ఉదంతాలు మంత్రిగారి అవినీతిని బట్టబయలు చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం దందాపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
Recommended Video

శ్రీరంగనాథ రాజు, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సూత్రధారులు , పాత్రధారి కొడాలి నాని అంటూ ధ్వజం
నాణ్యమైన బియ్యాన్ని పేద ప్రజలకు అందకుండా చేసి, నాసిరకం బియ్యాన్ని పేదలకు సరఫరా చేస్తూ, నాణ్యమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని, ఈ దందా ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులకు నాని తన పూర్తి అండదండలు అందిస్తున్నారని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ పేరుతో నాలుగు వేల కోట్ల కుంభకోణానికి తెర తీశారని ఈ వ్యవహారంలో సూత్రధారులు శ్రీరంగ నాధరాజు, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి కాగా పాత్రధారి కొడాలి నాని అంటూ నిప్పులు చెరుగుతున్నారు టిడిపి నేతలు. మరి ఈ వ్యవహారంపై టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications