బాబు, లోకేష్‌ను తిట్టిపోసిన ఏబీవీపీ సభలో సుజనా చౌదరి, చిక్కులు!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు! అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభకు సుజన హాజరుకావడంపై టిడిపి శ్రేణులు అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది.
గుంటూరులో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో సుజనా చౌదరి పాల్గొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో టిడిపి - బిజెపిలు కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుజన ఏబీవీపీ సమావేశాలకు హాజరయ్యారు.

అయితే, సుజనా సమావేశం నుంచి వెళ్లిపోయాక.. ఏబీవీపీ జాతీయ నేత సురేష్... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పైన విమర్శలు చేశారు. సుజన పాల్గొన్న సమావేశంలో... పార్టీ అధినేత, ఆయన తనయుడి పైన విమర్శలు చేయడాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతోందంటున్నారు.
గుంటూరులో జరిగిన ఏబీవీపీ సభకు సుజనా చౌదరితో పాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్యతో పాటు సుజన కూడా పాల్గొని, ప్రసంగించారు. సాధారణంగా ఒక పార్టీ సమావేశానికి లేదా ఓ పార్టీ విభాగం సమావేశానికి.. మిత్రపక్షణమైనా మరో పార్టీ నేతలు హాజరుకారు.












Click it and Unblock the Notifications