టిడిపి నేత అనుమానాస్పద మృతి: హత్యేనా?

విజయవాడ: విజయవాడ అర్బన్‌ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పడాల కన్నా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. చుట్టుగుంట వద్ద కన్నా మృతదేహం లభ్యమైంది. కన్నాది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కన్న మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

బ్యాలెన్స్‌ డబ్బులను అడిగినందుకు బైక్‌ యజమానిపై శనివారం ఇద్దరు దాడి చేసి గాయపర్చారు. కృష్ణా జిల్లా పోరంకి గ్రామానికి చెందిన విరోదుల సన్నిబాబు తన బైక్‌ని పి.గంగాధర్‌కు అమ్మాడు. అయితే 10 వేలు బ్యాలెన్స్‌ ఉంచి ఈ నెల 10న ఇస్తానని చెప్పాడు.

TDP Vijayawada urbun leader dead in suspicious conditions

అప్పటి నుంచి గంగాధర్‌ బ్యాలెన్స్‌ సొమ్ము ఇవ్వకుండా సన్నిబాబుని తిప్పసాగాడు. చివరికి శనివారం సన్నిబాబు బ్యాలెన్స్‌ సొమ్ము ఇస్తావా లేదా అంటూ గంగాధర్‌తో ఘర్షణ పడ్డాడు. దీంతో గంగాధర్‌, సాంబయ్యలు కలిసి సన్నిబాబుపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఆదివారం కూడా పదిహేడున్నర ఎకరాల గడ్డివామి దగ్ధమైంది. కృష్ణా జిల్లా కంచడం గ్రామంలోని వరి పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తా చెదారానికి నిప్పంటించడంతో మంటలు చెలరేగి గ్రామంలోని పాపాని కృష్ణకు చెందిన మూడు ఎకరాలు, కేతినేని రామకృష్ణకు చెందిన రెండు ఎకరాలు, బండారు గణే్‌షకు చెందిన నాలుగు ఎకరాలు, పుప్పాల అర్జునరావుకు చెందిన ఎకరంన్నర, జన్యావుల పాములుకు చెందిన ఎకరం, బొల్లా శేషగిరిరావుకు చెందిన ఐదు ఎకరాలు, పర్ణం నాగయ్యకు చెందిన ఎకరం గడ్డివాములు దగ్ధమయ్యాయి. బంటుమిల్లి ఫైర్‌ ఆఫీసర్‌ కరీంబేగ్‌ ఆధ్వర్యంలో మంటలను అదుపులోకి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+