Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ అంశం - ప్రధాని జోక్యానికి డిమాండ్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పార్లమెంట్ ను తాకింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత భవనంలో చివరి రోజు. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ సమయంలో టీడీపీ లోక్ సభా పక్ష నేత గల్లా జయదేవ్ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని జోక్యం కోరారు. వైసీపీ నేత మిధున్ రెడ్డి కౌంటర్ చేసారు. స్పీకర్ ఈ సమయంలో స్పష్టత ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ లోక్ సభలో లేవనెత్తింది. చంద్రబాబు అరెస్ట్ ఏపీ చరిత్రలో బ్లాక్ డే గా ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రధాని, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు.

Galla Demands PM intereference

చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేసారని విమర్శించారు. చంద్రబాబుకు డబ్బు అందినట్లు ఎలాంటి ఆరోపణలు చూపలేదన్నారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేసారు.

గల్లా ప్రసంగం సమయంలో వైసీపీ లోక్ సభా పక్ష నేత మిధున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. కేసులో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన అవినీతిని స్టేల ద్వారా తప్పించుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ కేసులో ప్రమేయం పూర్తి ఆధారాలతో నిరూపితం అయిందని చెప్పారు.

Galla Demands PM intereference on Chandra Babu Arrest issue

చంద్రబాబు పీఏకు ఐటీ నోటీసు ఇవ్వగా..ఆయన విదేశాలకు పారిపోయారని సభలో వివరించారు. ఈ కేసులో చేసిన అవినీతి సొమ్ము 80 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని..చంద్రబాబు ప్రమేయం పైన పూర్తి ఆధారాలు ఉన్నాయని మిధున్ రెడ్డి వివరించారు.

మిధున్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఇరు పక్షాల నుంచి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోర్టులో ఉన్న సమయంలో సభలో చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బెయిల్ అంశం కోర్టు ముందు ఉందని..విచారణ చేసి కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. కోర్టులో విచారణలో ఉన్న ఈ అంశం పైన సభలో చర్చకు అనుమతించనని స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+