ఒక్క రోజులో సీన్ రివర్స్, డూ ఆర్ డై - పులివెందుల ఎన్నికలో బిగ్ టర్న్..!!
పులివెందుల జెడ్పీటీసీ బై పోల్ కు సర్వం సిద్దమైంది. వైసీపీ - టీడీపీ మధ్య ఇక్కడ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. రెండు పార్టీలు తుది ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావటంతో ఇక్కడ గెలుపును టీడీపీ సీరియస్ గా తీసుకుంది. వైసీసీ సైతం పులివెందులలో తమ పట్టు నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ప్రచారం ముగిసింది. కాగా, ఒక్క రోజులో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితం పైన ఉత్కంఠ పెంచుతున్నాయి.
సర్వం సిద్దం
కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఎన్నిక జరగనుంది. ఇందు కోసం 1400 మంది భద్రత కల్పించారు. జగన్ సొంత నియోజకవర్గ పరిధిలో జరిగే ఎన్నిక కావటంతో టీడీపీ, వైసీపీ ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 11 మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు రెండు పార్టీలకు డూ ఆర్ డై గా మారింది. చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

హోరా హోరీ
టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డిలు భుజాన వేసుకున్నారు. అటు మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వ్యూహరచనతో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పాటుపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఈ రెండు ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో కలకలం రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేయబోతున్నారు. రెండు పార్టీలు పోలింగ్ వేళ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఉత్కంఠ
పులివెందుల - ఒంటిమిట్టలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు చివరి నిమిషం వరకు ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలు పోటీ చేస్తున్నారు. మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోకల్‌గానే ఒంటిమిట్టలోనే తిష్ఠ వేసి ముద్దుక్రిష్ణారెడ్డి గెలుపు కోసం వ్యూహాలు అమలు పరుస్తున్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, కడప మేయరు సురేశ్ బాబు, గోవిందరెడ్డితో సహా ఇతర అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మొత్తం 13 పంచాయతీలు, 24,600 ఓట్లు ఉన్నాయి. 11 మంది బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ మారుతున్న సమీకరణాలతో రెండు పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసారు.












Click it and Unblock the Notifications