వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై వ్యతిరేకత లాభం: పవన్ కళ్యాణ్‌తో బేరాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

TDP wants to garner Chiranjeevi's opposition from Pawan Kalyan
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రి చిరంజీవిపై ఉన్న వ్యతిరేకతను సీమాంధ్రలో తన వైపు మళ్లించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌కు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో విభేదిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో కాంగ్రెసేతర పార్టీలు పవన్ కళ్యాణ్‌కు గాలం వేసే పనిలో పడ్డాయి.

రాష్ట్ర విభజనను అంగీకరించడంతో సీమాంధ్రలో చిరంజీవికి వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. చిరంజీవి వ్యతిరేకత ఓటును తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఉపయోగపడుతుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌ను తమ వైపు తిప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి మరో విధంగా కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

సీమాంధ్రలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెసు వైపు ఉంది. నాయకత్వం కూడా దాన్ని ప్రధానం చేసుకునే ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ తమ వైపు వస్తే కాపు సామాజిక వర్గాన్ని చీల్చి, ఓ వర్గం మద్తును తాము పొందవచ్చునని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

సీమాంధ్రలో కాపు సామాజిక వర్గం మద్దతు పొందడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రయత్నాలు సాగించారు. సీతా రామలక్ష్మికి రాజ్యసభ టికెట్ ఇవ్వడమే కాకుండా కాపులను బిసీల్లో చేర్చే విషయానికి సానూకూలంగా స్పందించారు. ఇటువంటి స్థితిలో కొంత వదులుకున్నా సరే, పవన్ కళ్యాణ్ మద్దతు పొందితే ఆ మేరకు కలిసి వస్తుందనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

English summary
It is said that to garner the the support of Kapu community Telugudesam party president Chandrababu Naidu is trying to take Pawan Kalyan into his fold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X