• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టార్గెట్ 2019: గెలిచే వారికే టిక్కెట్లు, కాకినాడపై అసంతృప్తి, బాబు ప్లాన్ ఇదే !

By Narsimha
|

అమరావతి:2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టిడిపి ప్రణాళికలను సిద్దం చేస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహన్ని రాష్ట్రంలో జరగే ప్రతి ఎన్నికల్లో అనుసరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. కౌంట్‌డౌన్ మొదలైంది, వచ్చే ఎన్నికల్లో గెలిచేవారికి టిక్కెట్లను కేటాయించనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను మిషన్ 2019 ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సోమవారం మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో చంద్రబాబు పాల్గొన్నారు.

2018 చివర్లో ఎన్నికలు, నంద్యాల ఫలితాలే ,టిడిపి ప్లాన్ ఇదే! 2018 చివర్లో ఎన్నికలు, నంద్యాల ఫలితాలే ,టిడిపి ప్లాన్ ఇదే!

నంద్యాల, కాకినాడలో అనుసరించిన వ్యూహలు మంచి ఫలితాలను ఇచ్చాయని చంద్రబాబునాయుడు ఈ వర్క్‌షాప్‌లో ప్రకటించారు. రానున్న రోజుల్లో ఇదే వ్యూహన్ని అనుసరించనున్నట్టు చెప్పారు.

పార్టీ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని బాబు ప్రకటించారు. అయితే నేతలు తనకు ఎంత సన్నిహితులైనా సరే ఆచరణ విషయంలో మాత్రం కఠినంగా ఉంటానని బాబు స్పష్టం చేశారు.

గెలిచే వారికే టిక్కెట్లు

గెలిచే వారికే టిక్కెట్లు

ప్రణాళికాబద్ధంగా పని చేస్తే మొత్తం 175 స్థానాలను గెలవడం అసాధ్యం కాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు వస్తాయని తేల్చిచెప్పారు. ‘‘నాకు ఎంత దగ్గరి వారైనా... వారిపై నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే! వారు గెలిచే అవకాశం ఉంటేనే టికెట్‌ ఇస్తా. ఒకటి రెండుసార్లు కాదు... నాలుగుసార్లు సర్వే చేయించి మరీ నిర్ణయం తీసుకొంటానని బాబు స్పష్టం చేశారు.

వ్యక్తులు ముఖ్యం కాదు

వ్యక్తులు ముఖ్యం కాదు

పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ముక్యమని చంద్రబాబునాయుడు టిడిపి వర్క్‌షాప్‌లో ప్రకటించారు. తనకు వ్యక్తులు ముఖ్యం కాదని బాబు తేల్చి చెప్పారు.
తిరుగులేని మెజారిటీతో పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడం... ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడం ఒకటే లక్ష్యం'' అని వివరించారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు నేటి నుంచే కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు.2019 మే లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలైతే 2018 డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందన్నారు బాబు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.

నంద్యాల ఫలితాలు బలాన్ని ఇచ్చాయి

నంద్యాల ఫలితాలు బలాన్ని ఇచ్చాయి

నంద్యాల, కాకినాడ ఫలితాలు తనకు బలాన్ని ఇచ్చాయని చంద్రబాబు ప్రకటించారు. ఇంకొంచెం గట్టిగా ఉంటూ, కొరడా ఝళిపించాలంటూ ప్రజలు తనకు ఈ ఎన్నికల ద్వారా టానిక్‌ ఇచ్చారని చమత్కరించారు. తాను నేతలతో చనువుగా ఉన్నప్పటికీ... కార్యాచరణ విషయంలో మాత్రం కఠినంగానే ఉంటానని స్పష్టం చేశారు. ‘‘నంద్యాలలో మనకు 56 శాతం ఓట్లు పడ్డాయి. కాకినాడలో పార్టీ రెబల్స్‌తో కలుపుకొంటే 56 శాతం ఓట్లు, 80 శాతం డివిజన్లు మనకు వచ్చాయి. ఇది ప్రారంభం. ఇదే ఊపు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదని బాబు అభిప్రాయపడ్డారు.

నంద్యాల, కాకినాడ వ్యూహం రాష్ట్రమంతా అమలు చేయాలి

నంద్యాల, కాకినాడ వ్యూహం రాష్ట్రమంతా అమలు చేయాలి

ప్రతి నియోజకవర్గంలో ప్రజల సంతృప్తి పది శాతం పెరగాలి. నేను నిశితంగా గమనిస్తుంటాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ప్రతిరోజూ పరీక్ష మాదిరిగా పనిచేయాలని బాబు పార్టీ నేతలకు సూచించారు.నంద్యాల, కాకినాడలో మనం అనుసరించిన వ్యూహం ఇకపై రాష్ట్రమంతా అమలు కావాలి. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బాధ్యుడిని నియమించాలి. ఆ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందే బాధ్యత, సమస్యల పరిష్కారం అతనే చూసుకోవాలని బాబు చెప్పారు.ప్రతి నియోజకవర్గాన్ని 20 క్లస్టర్లుగా విభజించి ఇన్‌చార్జిలను నియమించాలన్నారు.. ప్రతి నియోజకవర్గంలో సోషల్‌ మీడియా గ్రూపు ఏర్పాటు చేసి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితరాల ద్వారా అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన కల్పించాలన్నారు.

నంద్యాల, కాకినాడలో బలం పెంచుకొన్నామిలా

నంద్యాల, కాకినాడలో బలం పెంచుకొన్నామిలా

నంద్యాల, కాకినాడల్లో పరిస్థితి తెలుగుదేశానికి అనుకూలంగా ఎలా మారిందో చంద్రబాబు వివరించారు. ‘‘నంద్యాలలో మొదట మనది సంక్షోభ పరిస్థితి. ఉన్న ఇన్‌చార్జి బయటకు వెళ్లిపోయారు. అయినా ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొన్నాం. మొదట గెలుపుపై దృష్టి పెట్టి తర్వాత 30 వేల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకొన్నాం. కాకినాడలో మొదట మైన్‌సలో ఉన్నాం. తర్వాత ఆధిక్యంలోకి వచ్చాం. అక్కడ ప్రతిపక్షం ఒక డివిజన్‌ అదనంగా గెలుచుకొంది. ఆ ఒక్కటే నాకు అసంతృప్తి కలిగించింది'' అని పేర్కొన్నారు. ఇదే సమయంలో శిల్పా మోహన్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండా చురకలు అంటించారు. ‘‘నంద్యాలలో ఒక పెద్ద మనిషి తాను లేకపోతే మన పార్టీకి పొద్దు పొడవదని అనుకొన్నారు. ఆయన పోవడమే కాకుండా తన తమ్ముడి పదవిని కూడా 2 నెలల్లో పోగొట్టాడు'' అని అన్నారు.

కొత్త ఓటు బ్యాంక్‌ను సృష్టించుకొన్నాం

కొత్త ఓటు బ్యాంక్‌ను సృష్టించుకొన్నాం

ఎక్కడ వీలైతే అక్కడ కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షం సర్వశక్తులు ఒడ్డినా... ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేశారని చంద్రబాబు తెలిపారు. ‘‘మన ఓటు బ్యాంకును కాపాడుకొన్నాం. కొత్త ఓటు బ్యాంక్‌ను సృష్టించుకొన్నాం. కింది స్థాయి రాజకీయ నిర్మాణం, పనితీరులో ప్రతిపక్షం మనకు ఏ దశలోనూ పోటీ కాలేకపోయింది'' అని చంద్రబాబు అన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో రాజకీయ పునరేకీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా చెప్పారు. ‘‘ఒక దశలో మనం ఎమ్మెల్యేలను తీసుకొన్నాం. ఇప్పుడు అంతకంటే కిందకు వెళ్లాలి. కింది స్థాయిలో అవతలివైపు బలంగా ఉన్న వారు పార్టీలో చేరతామంటే తీసుకోండి. ఎంత ఎక్కువ మందిని కలుపుకోగలిగితే అంత బలపడతాం'' అని తెలిపారు.

నంద్యాల, కాకినాడ ఫలితాలపై ఎల్లోబుక్

నంద్యాల, కాకినాడ ఫలితాలపై ఎల్లోబుక్

నంద్యాల, కాకినాడల్లో అనుసరించిన వ్యూహంపై ‘ఎల్లో బుక్‌' పేరుతో ఒక పుస్తకం తీసుకురానున్నట్లు తెలిపారు. ఇదే నమూనాలో అందరూ తమ నియోజకవర్గాల్లో వ్యూహ రచన చేయాలని ఆయన సూచించారు.పథకాల అమలులో రాజకీయ పక్షపాతానికి తావివ్వవద్దని స్పష్టం చేశారు.వచ్చే ఆరు నెలలకు పార్టీకి ఒక కార్యక్రమం ఖరారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి మొదలయ్యే జలసిరికి హారతి కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొనాలని, సెప్టెంబర్‌ 11 నుంచి మొదలయ్యే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానించారు.

English summary
Tdp will implement Nandyal and Kakinada strategy in 2019 elections.Tdp chief Chandrababu naidu participated workshop held at Mangalgiri on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X