స్థానిక ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన టీడీపీ: శ్రేణుల సంబరాలు
జిల్లాలో శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలో టీడీపీ సత్తా చాటింది. మూడు మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవికి ఉప ఎన్నికలు నిర్వహించగా నాలుగు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు .
గుంటూరు: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలో టీడీపీ సత్తా చాటింది. మూడు మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవికి ఉప ఎన్నికలు నిర్వహించగా నాలుగు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వివిధ కారణాలతో 2014లో ఎన్నికైన సభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినట్లు జడ్పీ సీఈవో నాగార్జున సాగర్ తెలిపారు. ఓసీ మహిళకు కేటాయించిన అమరావతి ఎంపీపీ స్థానాన్ని నంబూరి చిట్టెమ్మ (లింగాపురం) కైవసం చేసుకున్నారు.

ఎస్సీ మహిళకు కేటాయించిన అచ్చంపేట ఎంపీపీ పదవికి గుడేటి మార్తమ్మ(కస్తల) ఎన్నికయ్యారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఫిరంగిపురం ఎంపీపీగా పెరికల అన్నమ్మ (ఫిరంగిపురం), కాకుమాను మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా శివనాగులు (తెలగాయపాలెం) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ మరోసారి హావా చాటడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications