టీడీపీ గెలుపు వెనుక - చంద్రబాబు లెక్క పక్కా: అసెంబ్లీ ఎన్నికల్లోనూ...!!

చంద్రబాబు అంచనాలు నిజమయ్యాయి. ఆ నిర్ణయమే టీడీపీ విజయంలో కీలకమైంది.

టీడీపీకి సరైన సమయంలో అవసరమైన విజయం అందింది. గెలిచింది ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా..టీడీపీకి అసవరమైన జోష్ ఇచ్చింది. చంద్రబాబు అంచనాలు నిజమయ్యాయి. ముందుస్తుగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయి. వైసీపీ ఉపాధ్యాయ నియోజకవర్గాలలో గెలిస్తే..టీడీపీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించింది.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఈ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇదే సమయంలో పొత్తుల లెక్కలపైన స్పష్టత వచ్చింది. అదే టీడీపీ విజయంలో కీలకమైంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల అంచనాలపై క్లారిటీ వస్తోంది.

TDP wins Three MLC Graduates’ seats,benfits with PDF Alliance

నిజమైన చంద్రబాబు అంచనాలు

ఏపీలో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త చర్చలకు కారణమవుతున్నాయి. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. అయితే, ఈ విజయం అనేక సమీకరణాలు పని చేసాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ ఎన్నికలను వైసీపీ - టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన అభ్యర్ధులను గెలుచుకోవటం కోసం చంద్రబాబు ముందుగానే వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. జనసేనతో అసెంబ్లీ ఎన్నికలకు పొత్తుతో వెళ్లాలని డిసైడ్ అయిన వేళ..ఈ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పట్టభద్రులు..ఉపాధ్యాయ వర్గాలతో నిరంతరం టచ్ లో ఉండే లెఫ్ట్..పీడీఎఫ్ తో చంద్రబాబు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. గెలుపులో కీలకంగా మారింది.

TDP wins Three MLC Graduates’ seats,benfits with PDF Alliance

గెలిపించిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు

వైసీపీ..టీడీపీ అభ్యర్ధుల మధ్య తొలి ప్రాధాన్యత ఓట్లలో మూడు నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు సాగింది. పీడీఎఫ్ తో టీడీపీకి ముందస్తు అవగాహన ఉండటంతో పీడీఎఫ్ అభ్యర్ధుల రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ శాతం టీడీపీ అభ్యర్దులకే వెళ్లాయి. కొంత మేర వైసీపీకి బదిలీ అయ్యాయి. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్ది రమాప్రభకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో టీడీపీ అభ్యర్ధికి 6,645 రాగా, వైసీపీ అభ్యర్ధికి 2,025 వెళ్లాయి.

తూర్పు రాయలసీమలో బీజేపీ అభ్యర్ధికి పోలయిన రెండో ప్రాధాన్యత ఓట్లలో 2,004 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్ధికి 1,051 ఓట్లు దక్కాయి. పీడీఎఫ్ అభ్యర్దికి పోలయిన రెండో ప్రాధాన్యత ఓట్లలో టీడీపీకి 8,355 దక్కగా.. వైసీపీకి 2,974 ఓట్లు వైసీపీకి వచ్చాయి. పశ్చిమ రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్దికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో టీడీపీకి అభ్యర్దికి 9,886 రాగా, వైసీపీకి 3,352 ఓట్లు వచ్చాయి.

TDP wins Three MLC Graduates’ seats,benfits with PDF Alliance

ఎమ్మెల్యే ఎన్నికల్లో కీలక అడుగులు

ఈ ఎన్నికల ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల పైన చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ పొత్తుతో టీడీపీ మూడు స్థానాలు గెలుచుకుంది. దీంతో...మరోసారి పొత్తులు కీలకం కానున్నాయి. టీడీపీ పట్టభద్రుల నియోజకవర్గాలను గెలుచుకున్నా.. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ వైసీసీ వర్సస్ టీడీపీ మధ్య హోరా హోరా పోటీ సాగింది. కేవలం పట్టభద్రులకే పరిమితం అయిన ఈ ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయనే వాదనను వైసీపీ ఖండిస్తోంది.

ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు దిశగా వేగంగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో పట్టభద్రుల నియోజకవర్గాల్లో అందునా ఉత్తరాంధ్ర - రాయలసీమ నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలు..ఓటింగ్ సరళి పైన వైసీపీ అధ్యయనం చేస్తోంది. ఇటు వైసీపీ..ఇటు టీడీపీ ఇక అసెంబ్లీ ఎన్నికల దిశగా కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+