పవన్ ఎత్తుగడ ఫలించిందా ? టీడీపీ ఎందుకు వెనక్కి తగ్గింది ?
ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పార్టీ నేత రాజేష్ మహాసేన మొదలుపెట్టిన డిమాండ్ ను ఆ తర్వాత ఇతర నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, బుద్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ అందుకున్నారు. అయితే నిన్న ఉన్నట్లుండి టీడీపీ అధిష్టానం దీనిపై స్పందించి ఈ ప్రచారానికి వెంటనే బ్రేక్ వేసింది. అయితే ఈ విషయం తెలియని మంత్రి టీజీ భరత్ దావోస్ లోనూ లోకేష్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేసి సీఎం చంద్రబాబుతో తిట్లు తిన్నారు. అయితే టీడీపీ ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది ?
రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ గతంలో ఓ ఒప్పందం చేసుకున్నాయి. అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం కావాలని, పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని, మిగతా నేతలకు ఇతర పదవుల పంపకాలు చేసుకోవాలని వారు నిర్ణయించారు. అయితే దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది. అదీ లోకేష్ వర్గంగా భావిస్తున్న వారితో ఈ ప్రచారం మొదలుపెట్టింది.
తొలుత నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని భావించినా చివరికి దీని వెనుక వ్యూహం ఉందని అందరికీ అర్ధమైంది.

వాస్తవానికి టీడీపీలో ఓ అనవాయితీ లేక సంప్రదాయం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమకు అనుకూలమైన మీడియా లేదా నేతల ద్వారా జనంలోకి లీకులు ఇవ్వడం, దానిపై సానుకూలత వస్తే సదరు నిర్ణయంపై ముందుకు వెళ్లడం, రాకపోతే ఏదో కారణంతో వెనక్కి తగ్గడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసే విషయంలోనూ అదే జరిగిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారంపై వ్యతిరేకత వచ్చింది ఎక్కడన్న ప్రశ్న ఎదురైంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే నష్టం కూడా ఆయనకే. గతంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎలాంటి అధికారాలు లేకుండా కేవలం పేరుకే అన్నట్లు కొనసాగారు. దీంతో పవన్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉండాలనుకున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ రూపంలో మరో డిప్యూటీ సీఎం వస్తే మజ్జిగ పలుచన కావడం ఖాయం. అందుకే గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం మొదలుపెట్టినా సైలెంట్ గా ఉన్న పవన్.. నిన్న మాత్రం తిరుపతి నేత కిరణ్ రాయల్ తో కౌంటర్ ఇప్పించారు.
లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో, అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఘాటు కౌంటర్ లా మారాయి. ఈ వ్యాఖ్యల ప్రభావంతోనే టీడీపీ వెంటనే అప్రమత్తమై లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు లీకులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే మిగతా నేతలు సైలెంట్ అయినా విషయం తెలియని మంత్రి టీజీ భరత్ ఏకంగా దావోస్ లోనే, సీఎం చంద్రబాబు ముందే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా లోకేష్ కాబోయే సీఎం అన్నారు. భరత్ వ్యాఖ్యల్ని పక్కనబెడితే టీడీపీ ఇలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయిందన్న ప్రచారం జరుగుతోంది.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications