వైఎస్ భారతిని తిట్టిన కేసులో చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ? గతంలో రోజాను ఏమన్నాడో తెలుసా ?

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారతిని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో టీడీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి లింక్ చేస్తూ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఎక్స్ లో ఈ విమర్శల్ని ఆయన సొంత పార్టీ టీడీపీ నేతలే తీవ్రంగా తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సీరియస్ గా స్పందించిన టీడీపీ అధిష్టానం చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

tdp worker chebrolu kiran detained in ys bharati remarks case mocked roja also in past

అయితే చేబ్రోలు కిరణ్ గతంలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మరో యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ రోజాను ఫైనల్ గురించి మాట్లాడొద్దని కోరాడు. ఆమె నోరు విప్పితే ఫైనల్లో ఇండియా ఓడిపోతుందన్నాడు. అంతే కాదు రోజా ఐరన్ లెగ్ అని, ఆమె కుంభమేళాకు వెళ్తే అక్కడ భక్తులు తొక్కిసలాట జరిగి చనిపోయారంటూ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

చేబ్రోలు కిరణ్ గుంటూరు టీడీపీ ఆఫీసులో టీబాయ్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇతను టీడీపీ పెద్దల మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని సమాచారం. అయితే ఈసారి మాత్రం వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉండటంతో స్వయంగా సొంత పార్టీ టీడీపీ స్పందించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో అతను సారీ చెప్తూ వీడియో విడుదల చేశాడు. అయినా ఈ వ్యవహారంలో టీడీపీ ఆత్మరక్షణలో పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+