ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోకూడా రాజకీయాలు..! చీరాలలో కొట్టుకున్న వైసీపీ,టీడీపీ నేతలు
చీరాల : దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగితేలితే.. ప్రకాశం జిల్లాలో మాత్రం రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు సాములు మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌లో మాటల తూటాలు పేలాయి.

టీడీపీ, వైసీపీ.. ఫైటింగ్ సీన్
చీరాల తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఎగురవేయడానికి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం. అదే సమయంలో ఆమంచి సోదరుడు సాములు తన అనుచరులతో కలిసి అక్కడకు వచ్చారు. ఆ సందర్భంలో ఇరు పార్టీల కార్యకర్తలు మాటలు తూలారు. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఒకానొక దశలో పోలీసులు జోక్యం చేసుకున్నా వారెవరూ వినిపించుకోలేదు.
ఐదుసార్లు ఎమ్మెల్యే.. హైదరాబాద్‌లో 5 రూపాయల భోజనం.. సింపుల్ మ్యాన్

జెండా పండుగ నాడు కూడా పాత కక్షలేనా?
జెండా పండుగ వేళ చీరాలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడం స్థానికంగా చర్చానీయాంశమైంది. ఇదివరకు కూడా కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. ఆ రెండు వర్గాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో స్వాంత్రత్య దినోత్సవ వేళ కూడా సంయమనం పాటించకుండా ఇరు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడటం హాట్ టాపికయింది.

చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులు లాఠీ ఎత్తితే గానీ..!
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరూ కూడా తగ్గకపోవడంతో చాలాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. నువ్వెంతంటే నువ్వెంత అంటూ తిట్ల దండకం అందుకున్నారు. మాటలు జారుతూ ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ఆ నేపథ్యంలో తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇరు వర్గాలకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు లాఠీలు లేపారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ శ్రేణులను నిలువరించి అందర్నీ చెదరగొట్టారు.
భారత్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు.. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపిన రష్యా

కరణం, ఆమంచి వర్గాల మధ్య ఈ గొడవలేంటో..!
చీరాల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందన్న వార్త దావానంలా వ్యాపించడంతో అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ స్థానికంగా కనిపించింది. అయితే ఇరు వర్గాలు ఒకేసారి అక్కడకు రావడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అదలావుంటే కరణం బలరాంకు జెండా ఎగురవేసే అర్హత లేదని ఆమంచి సాములు వర్గీయులు అడ్డుకోవడంతోనే ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. మొత్తానికి మరోసారి చీరాలలో కరణం, ఆమంచి వర్గాల మధ్య దుమారం రేగడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. అయితే ఇండిపెండెన్స్ డే రోజు కూడా నేతలు సహనం పాటించకుండా రాజకీయ కక్షలు బయటపెట్టుకోవడం మంచి పద్దతి కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications