వైసీపీకి పీకే సర్వే షాక్: 4 గ్రామాలే కీలకం, జగన్ ప్రచారం వెనుక..

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను వైసీపీ, టిడిపిలు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే నంద్యాలలో వైసీపీ చీఫ్ జగన్ మకాం వేయడం వెనుక ప్రశాంత్‌కిషోర్ ఉన్నాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో పార్టీ పరిస్థితిపై ప్రశాంత్‌కిషోర్ ఇప్పటికే సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది. ఆయా మండలాల్లో ఏం చేయాలనే దానిపై ప్రశాంత్‌కిషోర్ నివేదిక ఆధారంగా వైసీపీ వ్యూహరచన చేస్తోంది.

ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రశాంత్‌కిషోర్ ఈ నియోజకవర్గంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగానే వైసీపీ సుదీర్ఘంగా నంద్యాలలో మకాం వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రెండు దఫాలు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ నెల 19వ, తేది తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

 ప్రశాంత్‌కిషోర్ సర్వే ఆధారంగా

ప్రశాంత్‌కిషోర్ సర్వే ఆధారంగా

నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, వైసీపీ పరిస్థితిపై ప్రశాంత్‌కిషోర్ బృందం ఇప్పటికే సర్వే నిర్వహించి వైసీపీ చీఫ్ జగన్‌కు నివేదిక ఇచ్చింది. గోస్పాడు మండలంలోనే వైసీపీకి పట్టుందని తేలింది. నంద్యాల రూరల్, నంద్యాల పట్టణంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక వెల్లడిస్తోందని పార్టీవర్గాలంటున్నాయి. దీంతో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టేందుకు జగన్ వ్యూహరచన చేసింది.

 ఆదినారాయణరెడ్డి ఇంచార్జీ వెనుక టిడిపి వ్యూహమిదే

ఆదినారాయణరెడ్డి ఇంచార్జీ వెనుక టిడిపి వ్యూహమిదే

గోస్పాడు మండలానికి మంత్రి ఆదినారాయణరెడ్డిని టిడిపి ఇంచార్జీగా నియమించింది.భూమా నాగిరెడ్డి బంధువు ఎస్‌వి మోహన్‌రెడ్డి కూడ ఈ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ మండలంలో భూమా కుటుంబానికి సంబంధాలున్నాయి. దీంతో ఎస్‌వి మోహన్‌రెడ్డి కూడ ఈ మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ ఇంచార్జీగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు సీపీ నాగిరెడ్డి గోస్పాడు మండలానికి చెందినవాడు.

గోస్పాడుపై టిడిపి కేంద్రీకరణ

గోస్పాడుపై టిడిపి కేంద్రీకరణ

గోస్పాడు మండలంలోని అన్ని గ్రామాలతో భూమా నాగిరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. భూమా నాగిరెడ్డి పార్టీ మారినా ఈ మండలంలో క్యాడర్ వైసీపీ వైపే ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో గోస్పాడు మండలంపైనే టిడిపి కేంద్రీకరించింది. అభివృద్ది పనులతో ఓటర్లను ఆకర్షించేందుకు గాను టిడిపి వ్యూహలను అమలు చేస్తోంది. 2014 ఎన్నికల్లో గోస్పాడు మండలంలో 28 వేల ఓట్లలో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి 750 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే ఈ మండలంలో వైసీపీకి మెజారిటీ తగ్గదనే అభిప్రాయంతో వైసీపీ నేతలున్నారు.దీంతో టిడిపి ఎక్కువగా ఈ మండలంపైనే కేంద్రీకరించింది.

 ఆ నాలుగు గ్రామాలే కీలకం

ఆ నాలుగు గ్రామాలే కీలకం

గోస్పాడు మండలంలోని యాలూరు, దీబగుంట్ల, జిల్లెల, గోస్పాడులోనే ఎక్కువగా ఓట్లున్నాయి. ఈ మండలంలోని ఈ నాలుగు గ్రామాలను జారీపోకుండా రెండు పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. రెండు పార్టీల నేతలు ఈ మండలంలోనే కేంద్రీకరించి పనిచేస్తున్నారు. అయితే ఇదే సమయంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి కంటే ముందంజలో ఉండేందుకుగాను వైసీపీ చీప్ జగన్ ప్రచారాన్ని నిర్వహించాలని జగన్‌కు పీకే సూచించారని సమాచారం. ఈ సమాచారం మేరకే జగన్ విస్తృంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబునాయుడు పర్యటించకముందే నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తున్నారు.దీంతో జగన్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ys Jagan implemented its strategy as per Prashant kishor directions in Nandyal by poll.Tdp, Ysrcp parties concentrated on Gospadu Mandal for get majority votes
Please Wait while comments are loading...