20 రకాల వంటకాలతో టీడీపీ "మహానాడు" ఫుడ్ మెనూ.. నాన్ వెజ్ కూడా !

కడప వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు" అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాకుండా.. తెలంగాణ, దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు కదిలివచ్చారు. అయితే ఈ సభలో అదిరిపోయే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. వైవిధ్యమైన వంటకాలు ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

భారీ భోజన ఏర్పాట్లు..

మహానాడు కార్యక్రమంలో మొదటి రెండు రోజులు దాదాపు రెండు లక్షల మందికి పైగా.. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందించేందుకు టీడీపీ అదిష్టానం ఏర్పాట్లు చేసింది. ఇక గురువారం జరగనున్న బహిరంగ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు తరలిరానుండటంతో.. సభ ప్రాంగణంలో రెండు లక్షల మందికి భోజన సదుపాయం కల్పిస్తూనే, బయట నాలుగు దిక్కులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

tdps-mahanadu-food-menu-with-20-plus-types-of-dishes-and-non-veg-also

అందుకోసం ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. మహానాడుకు హాజరైన ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనుండడం విశేషంగా మారింది. మరోవైపు తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్‌పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలు సైతం అందించనున్నారు. 50,000 కొడిగుడ్లు కూడా రెడీ చేసినట్టు సమాచారం.

20 రకాలకు పైగా వంటకాలు..

ప్రతిరోజు 20 రకాలకు పైగా వంటకాలను వడ్డించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. అందుకోసం 1,700 మంది వంటవారు, 800 మంది వడ్డించే వారిని కూడా సిద్దం చేశారు. అంతే కాకుండా పార్టీ తరుపు నుంచి కూడా హెల్పర్స్ అందుబాటులో ఉంటారని అంటున్నారు. ఇప్పటికే వంటలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

భోజన మెనూ..

ఉదయం అల్పాహారం..

టూటీ ఫ్రూటీ కేసరి

పొంగలి

ఇడ్లీ

టమాటా బాత్

కాఫీ, టీ

మధ్యాహ్న భోజనం..

మాంసాహార వంటకాలు: గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్

శాఖాహార వంటకాలు : గోంగూర పూల్ మఖానా, టమాటా పప్పు, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ, చిప్స్

వైట్ రైస్, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు

మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి, పెరుగు

సాయంత్రం స్నాక్స్..

కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీ

కాఫీ, టీ

రాత్రి భోజనం..

రైస్

వంకాయ బఠాణీ కర్రీ, ఆలూ ఫ్రై

పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు

కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత మొదటిసారి మహానాడును నిర్వహిస్తుండడం.. అది కూడా వైసీపీ అడ్డా అని చెప్పుకునే కడపలో విజయవంతంగా సాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+