గణేష్ నిమజ్జనాల్లో ఈ ఏడాది ఇదే హైలెట్..''మీకు రూ 15,000, మీకు 15,000''
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినాయక చవితి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి.ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు తరలి రావడం జరిగింది. ఎటువంటి అటంకాలు లేకుండా గణేష్ నిమజ్జనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తయ్యాయి. అయితే వినాయక చవితికి ముందు విజయవాడను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికి అక్కడ కూడా వినాయక చవితి సంబరాలు ఘనంగానే నిర్వహించారు. ఆటపాటలతో యూత్ సందడి చేశారు.
ముఖ్యంగా డీజేలతో యువత చిందులు వేశారు.అయితే ఈ ఏడాది వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన పాటలతో అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికి ఏమాత్రం అధికార పార్టీకి తగ్గకుండా ఆ పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకోవడం కనిపించింది. చాలా చోట్ల వినాయకుడు ఊరేగింపు సమయంలో జగన్ పాటలకు అభిమానులు డ్యాన్స్ వేయడం కనిపించింది. తెలంగాణలో కూడా జగన్ పాటలకు అభిమానులు చిందులు వేస్తూ కనిపించారు. ముఖ్యంగా ఖమ్మంలో జగన్ అభిమానులు మాస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కనిపించింది.

గణేష్ నిమజ్జనాల్లో ఈ ఏడాది ఇదే హైలెట్ ''మీకు రూ 15,000 ''#YSRCP #GaneshImmersion #GaneshImmersion2024 #ViralVideo #APPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/voiP5ZCer1
— oneindiatelugu (@oneindiatelugu) September 18, 2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిమ్మల రామానాయుడు ప్రజల దగ్గర వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్కూలుకు వెళ్లే ప్రతి పాప, బాబుకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తామని చెబుతారు. ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15,000 ఇస్తామని ఆయన చెబుతారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని ఆయన హామీ ఇస్తారు. దీనికి సంబంధించిన హామీ పత్రాన్ని కూడా నిమ్మల రామానాయుడు ప్రజలకు అందజేస్తారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు కాకపోవడంతో వైసీపీ శ్రేణులు ఈ విధంగా కూటమి ప్రభుత్వానికి సెటైర్స్ వేస్తూ వీడియోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications