21 మందిని కాపాడి.. ఫ్యామిలీని కోల్పోయిన శరణబసవ
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ బసవ అనే ఉపాధ్యాయుడు 21 మంది బాధితులను రక్షించారు. కానీ, తన భార్య, బంధువులను మాత్రం కోల్పోయారు. శరణ బెంగుళూరులో తన బావమరిది పెళ్లి చూపులకు వెళ్లి తిరుగుప్రయాణమయ్యారు.
ఆయన వెంట భార్య, మామ, అత్త, బావమరిది కూడా ఉన్నారు. అప్పుడే రైలు ప్రమాదం జరిగింది. మంటలతో అప్రమత్తమైన శరణ బాత్‌రూంలోని కిటికీ అద్దాలు పగుల కొట్టి సుమారు 21 మంది ప్రాణాలను కాపాడారు. అయితే భార్య సర్వ మంగళ, మామ బసవరాజు ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయాడు.

తాము మొత్తం ఐదుగురం ఉన్నామని, సెగ తగులుతుండటంతో ఒక్కసారిగా మెలకువ వచ్చిందని, వెంటనే సమీపంలో ఉన్న బాత్‌రూం వైపు పరుగెత్తి, అక్కడున్న కిటికీని పగులకొట్టి బయటపడ్డానని, పలువురు ప్రయాణికులను కూడా అటు నుంచి దూకమని కేకలు వేశానని చెప్పారు.
దాదాపు 21 మంది వరకు ప్రాణాలు దక్కించుకున్నారు. తమ బంధువుల్లో తనతో పాటు ముగ్గురం ప్రాణాలు కాపాడుకోగలిగామని కానీ, తన భార్య, మామ ప్రాణాలు మాత్రం దక్కలేదని విలపించారు. సర్వమంగళ కూడా ఉపాధ్యాయినిగా చేస్తున్నారు. అత్తను బయటకు తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications