ఎంఈవోని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయురాలు...ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

మార్కాపురం: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఎంఈవోని టీచర్ చెప్పుతో కొట్టినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మీడియాలో సైతం ఈ ఘటనపై వార్తలు రావడంతో విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఘటన వివరాలు ఇవి...

ప్రకాశం జిల్లా మార్కాపురం మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న రామ్‌దాస్‌నాయక్ గత కొంతకాలంగా మండల పరిధిలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడట. అతని వేధింపులు ఎక్కువైపోవడంతో మంగళవారం భర్తతో కలసి ఎంఈవో ఆఫీసుకు వచ్చిన ఆ టీచర్ భర్త ముందే ఎంఈవోను చెప్పుతో కొట్టిందట.

 ఇలా జరిగింది...

ఇలా జరిగింది...

ఎంఈవో, టీచర్ మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఆ టీచర్ చెప్పుతో కొట్టడంతో ఈ ఘటనను అక్కడ వున్న టీచర్స్ గమనించి ఎంఈవోను పక్కకు తీసుకెళ్లారట. ఆ తరువాత ఈ విషయాన్ని తోటి ఉపాధ్యాయులకు చెప్పారట. అలా ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ఆ తర్వాత సోషల్ మీడియాకు చేరి వైరల్ గా మారి చివరకు మీడియాలో వార్తలు వచ్చేంతవరకు వెళ్లింది. దీంతో ఈ విషయంపై విద్యా శాఖలో కలకలం రేగడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రాజీ జరిగిందట...

రాజీ జరిగిందట...

అయితే ఈ ఉదంతం సంచలనం సృష్టించడంతో విద్యాశాఖ పరువు పోకుండేందుకని టీచర్, ఎంఈవోల మధ్య తోటి ఉపాధ్యాయులు రాజీ కురిర్చారట. అందులోను ఆ ఉపాధ్యాయురాలి భర్త కూడా హెడ్ మాస్టర్ కావడంతో సర్థి చెప్పుకొని రాజీ చేశారట.

 లేఖ, ఆడియో టేపు విడుదల

లేఖ, ఆడియో టేపు విడుదల

ఈ ఘటన ప్రకంపనలు సృష్టించడంతో ఆ తర్వాత కొద్ది గంటలకే ఆ ఉపాధ్యాయురాలు తాను ఎంఈవో ను చెప్పుతో కొట్టలేదని వివరణ ఇస్తూ ఒక లేఖను అదే లేఖలో ఆమె భర్త కూడా వివరణను కూడా పొందుపరుస్తూ లేఖను విడుదల చేశారు. ఆ లేఖతో పాటుగా ఏం జరిగిందో వివరిస్తూ ఆడియో టేపును కూడా విడుదల చెయ్యడం జరిగింది. అయితే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో స్పందించిన విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అసలు ఏం జరిగిందో తేల్చాలంటూ డిఈవోను విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+