ఆర్డినెన్స్‌లా చించలేరా?: టి కేబినెట్ నోట్‌పై వాసిరెడ్డి పద్మ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీసం కేబినెట్ నోట్‌ను ఆపలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధం చేయడం అంటే సీమాంధ్ర ప్రజలను అవమానించడమేనన్నారు. 65 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
సీమాంధ్ర ప్రజల ఆవేదన కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చివరి బంతి వరకు పోరాడుతామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తల పగిలేలా ఉన్నా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మంత్రులు ఏం చేస్తారు: అశోక్ బాబు
కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తే ఏం చేస్తారో కేంద్రమంత్రులు చెప్పాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ పైన నోట్ వస్తే రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తెరాస నాయకులకు లేఖలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు రాయాలని నిర్ణయించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications