అదృశ్యమైన టెక్కీ భవ్యశ్రీ: పాడేరులో సెల్‌ఫోన్ సిగ్నల్?
విశాఖపట్నం: టెక్కీ భవ్యశ్రీ ఆచూకీపై ఎప్పటికప్పుడు కొత్త ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మూడు రోజుల క్రితం అదృశ్యమైన భవ్యశ్రీ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అయితే, ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విశాఖపట్నం జిల్లా పాడేరు అతిథి గృహంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.
సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సైబరాబాద్ పోలీసులు పాడేరు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నట్లు, అయితే గదిలో పోలీసులకు ఆన్‌లో ఉన్న టీవీ కనిపించినట్లు, ఆమె మాత్రం కనిపించనట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

భవ్యశ్రీ అదృశ్యంపై మీడియాలో వార్తాకథనాలు ఎప్పటికప్పుడు విస్తృతంగా వస్తున్నాయి. వాటిని ఆమె తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడినట్లు తెలుస్తోంది.
అయితే, భవ్యశ్రీ కేసు పురోగతిని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్ టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు సోదాలు చేపట్టారు. అన్వరంలోని అన్ని లాడ్జీలు, దేవస్థానం వసతి గృహాల్లో తనిఖీలు చేశారు.
అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు అనుమానించారు. మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications