బైక్‌పై చెట్టు కూలి టెక్కీ మృతి: భార్యకి గాయాలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన యాప్రాల్‌కు చెందిన మృతుడు పనబాక రోహిత్ ఇటీవలే ఉద్యోగం వదిలేసి పూజారి కావడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ వస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను సైనిక్‌పురికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రితిక లూయిస్ కర్నంను వివాహం చేసుకున్నాడు. ఆమె హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
పెళ్లి వేడుక కోసం రిజర్వేషన్ చేసుకోవడానికి రోహిత్ తన భార్య రితికతో కలిసి కొంపల్లిలోని గుడ్ షెపర్డ్ చర్చికి ద్విచక్రవాహనంపై సోమవారం బయలుదేరాడు. మేడ్చేల్ హైవే సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా ఓ భారీ వృక్షం వారిపై కూలి పడింది. ఈ ఘటనలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
తలకు బలమైన గాయాలు కావడంతో రోహిత్ చికిత్స పొందుతూ మరణించాడు. రితిక తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రమాదం నుంచి బయటపడినట్లేనని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications