రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి: మద్యం తాగి లేడీ లాయర్

రసాయనాల లోడుతో వెళ్తున్న ఓ డిసిఎం వ్యాను శుక్రవారం అర్థరాత్రి హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో బోల్తా పడింది. అతి వేగంగా వెళ్తున్న డిసిఎం వ్యాన్ జివికె మాల్ వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన డ్రైవర్‌ను డిసిఎం నుంచి బయటకు తీశారు. అనంతరం 108 సిబ్బంది క్షతగాత్రుడ్ని అస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై అడ్గంగా పడిపోయిన డిసిఎంను క్రేన్ సాయంతో తొలగించారు.
బంజారాహిల్స్‌లోని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఓ మహిళ తాను న్యాయవాదినంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించకుండా చాలాసేపు హడావిడి చేసింది.
పోలీసులు సహనంతో తనిఖీలు చేసిన తర్వాత అతిగా మద్యం సేవించినట్లు నిర్థారించుకున్నారు. తనిఖీల్లో ఆరు కార్లు, ఓ ఆటో రిక్షాతో పాటు 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మందికి కూడా సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి, మంగళవారంనాడు న్యాయస్థానంలో వారిని ప్రవేశపెడతారు.












Click it and Unblock the Notifications