టెక్కీ భవ్యశ్రీ ఆదృశ్యంలో పురోగతి, గోదావరి జిల్లాలో..

హైదరాబాద్/రాజమండ్రి: హైదరాబాదులో గురువారం అదృశ్యమైన సాఫ్టువేర్ ఇంజనీర్ భవ్యశ్రీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భవ్యశ్రీ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ నేపథ్యంలో ఆమెను గోదావరి జిల్లాల్లో గుర్తించారు. ఆమెను హైదరాబాదుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భవ్యశ్రీ సేఫ్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. భవ్యశ్రీ ఆచూకీ లభ్యం కావడంతో నలభై గంటల మిస్టరీకి దాదాపు తెరపడినట్లుగా భావిస్తున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 7వ ఫేజ్‌లో నివాసం ఉండే కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ చరిత భార్యాభర్తలు. విజవాయడ ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Techie found in Godavari districts

కార్తీక్ హార్డ్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. భవ్యశ్రీ చరిత సాఫ్టువేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. గురువార ఉదయం భవ్యశ్రీ చరిత విధులకు వెళ్తున్నానని చెప్పి తన సంస్థ క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త కార్తీక్ ఆమె పని చేసే కంపెనీ వద్దకు వెళ్లి ఆరా తీశారు.

గురువారం ఆమె విధులకు హాజరు కాలేదని ఆమె పని చేసే సంస్థ ఉద్యోగులు తెలిపారు. బంధువులు, స్నేహితుల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం అర్ధరాత్రి కార్తీక్ చైతన్య కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు.

గురువారం ఉదయం తాను క్యాబ్‌లో కార్యాలయానికి చేరుకున్నట్లు భవ్యశ్రీ భర్తకు మెసేజ్ కూడా పెట్టారు. గంట తర్వాత కార్తీక్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం, సాయంత్రం ప్రయత్నించినా కలవలేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించారు.

భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెప్పారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆమె వెళ్లిపోయిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు భవ్యశ్రీ ఫోన్ నెంబర్ ట్రాకింగ్‌లో పెట్టగా.. చివరిసారి ధూల్‌పేట ప్రాంతంలో గుర్తించారు. అనంతరం గోదావరి జిల్లాలో ఆమె ఫోన్‌ను గుర్తించారు. ఇప్పుడు అక్కడి నుండి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

సనత్‌నగర్‌లో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

సనత్‌నగర్‌లో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. శుక్రవారం ఓ ప్రైవేటు స్కూల్‌ నుంచి ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టీచర్‌ మందలించాడనే మనస్తాపంతో విద్యార్థినులు కనిపించకుండాపోయినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+