ఫూటుగా తాగి, అర్ధరాత్రి లేడీ టెక్కీ వెంటపడ్డ కానిస్టేబుల్

హైదరాబాద్: తాగిన మత్తులో ఓ కానిస్టేబుల్ ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగిని వేధించిన సంఘటన హైదరాబాదులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సదరు కానిస్టేబుల్ ఫూటుగా తాగాడు. రోడ్డు మీద కనిపించిన వారిని దుర్భాషాలాడాడు. అదే సమయంలో ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి తన విధులు ముగించుకొని వెళ్తున్నారు.

సదరు కానిస్టేబుల్ ఆమె వెంట పడ్డాడు. ఆమెను వేధించాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను వెంబడించాడు. అయితే, స్థానికులు కొందరు ఆమెను అతని నుండి రక్షించారు. అయితే, తాను ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పాడు.

 Techie harassed by Constable

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్ పోలీసులు వేర్వేరు చోట్ల పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 14మందిని అరెస్టు చేశారు. బిచ్కుంద మండలంలోని కాస్లాబాద్‌ గ్రామంలో పేకాటాడుతున్న 11మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఉపేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కాస్లాబాద్‌ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేకు దాడులు నిర్వహించి 11మందిని అరెస్టు చేసి వారి నుంచి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిరి మాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు.

నగరంలోని దుబ్బ పవన్‌ నగర్‌లోని పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి 3వ టౌన్‌ పోలీసులు దాడి నిర్వహించారు. పవన్‌ నగర్‌లోని ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. ఎ క్కడైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఆగిన వృద్ధుడి గుండె తట్టుకోలేక ప్రాణం విడిచిన భార్య

ఆసరా పథకం కింద పింఛన్‌ మంజూరు కాకపోవడంతో మనస్థాపానికి గురైన మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండల కనిమెట్ట గ్రామానికి చెందిన వృద్ధుడు చిన్న దేవన్న(72) సోమవారం గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న అతని భార్య కురుమక్క(68) భర్త శవంపైపడి రోదిస్తూ ప్రాణాలు విడిచింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+