పేరెంట్స్ ప్రేమ కరువైందనే: టెక్కీ ఆత్మహత్యలో ట్విస్ట్
హైదరాబాద్: తల్లిదండ్రుల ప్రేమ కరువైందని ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఒక్కగానొక్క కొడుకును అయినప్పటికీ ఆడపిల్లల పైనే ప్రేమను చూపిస్తున్నారని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం రాత్రి మాచవరం డౌన్‌లోని ప్రతిభానికేతన్ రోడ్డులో కృష్ణమూర్తి అనే టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహానికి మాచవరం పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు వీరయ్య, శివపార్వతి, భార్య గీత మంగళవారం ఆసుపత్రికి చేరుకొని తీవ్రంగా రోదించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణమూర్తి ఆత్మహత్యకు ముందు రెండు లేఖలు రాశాడు. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు తనను చిన్నచూపు చుస్తున్నారని, తన సోదరిలపై చూపిస్తున్న ప్రేమ తనపై చూపడం లేదని ఆ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు.

అంతేకాకుండా బిల్డర్ మహేష్ తనను మోసం చేశాడని రాశాడు. అజిత్ సింగ్ నగర్లో టెక్కీ తండ్రికి 380 గజాల భూమి ఉంది. దీనిని ఇటీవల మహేష్ అనే బిల్డర్‌కు అభివృద్ధి కోసం ఇచ్చారు. అయితే ముందు నుండి ఈ భూమిని తండ్రి తనకు ఇస్తాడని కృష్ణమూర్తి భావించాడు. కానీ బిల్డర్‌కు ఇచ్చారు. విషయం తెలిసిన టెక్కీ కృష్ణమూర్తి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అనంతరం సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కృష్ణమూర్తి హైదరాబాదులోని నోవాటీస్ అనే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయల వేతనం. భార్య గీత కూడా సాఫ్టువేర్ ఇంజనీరే. కానీ, తల్లిదండ్రులు తన పైన ప్రేమ చూపించడం లేదని బలవన్మరణానికి పాల్పడటం విషాదకరం. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం కృష్ణమూర్తి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications