రేవంత్‌ది ఎంత తప్పో, ప్రభుత్వానిదీ అంతే తప్పు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలనడం సరైంది కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తొలి ప్రాధాన్యత నోటాకు రెండో ప్రాధాన్యత ఓట్లు వేశామని అయితే నోటాపై అవగాహన లేనందునే తప్పిదం జరిగిందని అన్నారు.

నామినేటెడ్ ఎమ్మెల్యే ముడుపుల ఘటనలో రేవంత్‌ది ఎంత తప్పో, ప్రభుత్వానిదీ అంతే తప్పు అని అన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, వారిని పార్టీలోకి చేర్చుకోవడం టీఆర్ఎసే ప్రారంభించిందని ఆరోపించారు.

Telangana bjp president kishan reddy fires on kcr government

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి తగినంత బలం లేకున్నా ఆరవ అభ్యర్ధిని నిలబెట్టడం ఎంతవరకు నైతికతని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పనిచేయాలని సూచించారు.

ఏపీ సీఎం చంద్రబాబుని విచారించాలి: వీహెచ్

రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుని కూడా విచారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రసమితిలో చేరిన వాళ్లంతా డబ్బులిస్తేనే మారారా అని ప్రశ్నించారు. దొరికితే దొంగలు...లేదంటే దొరలా? వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+