గవర్నర్ సాక్షిగా టీడీపీ, తెరాస బాహాబాహీ: సీన్ రివర్స్! (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమావేశాలలో శనివారం సీన్ రివర్స్ అయింది! తెలంగాణ ఏర్పడక ముందు నాడు గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తుండగా తెరాస సభ్యులు ప్రతులు చించేసిన విషయం తెలిసిందే. నాడు తెరాస తీరు పైన అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. శనివారం నాడు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరోసారి నాటి ఉదంతం కళ్లముందు కనిపించింది. తెరాస నేతలు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

గవర్నర్ సాక్షిగా అధికార, ప్రతిపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. ఫిరాయింపుల పైన టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. వారితో కాంగ్రెస్ స్వరం కలిపింది పోడియం వద్దకు ప్లకార్డులతో దూసుకెళ్లారు. దీంతో అధికార పార్టీ సభ్యులు రంగంలోకి దిగారు. ప్లకార్డులు లాక్కొని తోసివేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కింద పడిపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు స్వల్ప గాయమైంది.

ఆయన పైన తెరాస సభ్యులు దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, హరీష్ రావు, పొంగులేటిలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విపక్ష సభ్యులు బెంచి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో గందరగోళం మధ్యనే గవర్నర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన నిరసన పంథాను వీడలేదు. గవర్నర్ నరసింహన్ అరుపులు, కేకల మధ్య ప్రసంగం పూర్తి చేశారు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ స్వామి గౌడ్.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.

అసెంబ్లీ

అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్ 11వ తారీకున బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

అసెంబ్లీ

అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న సీఎం కేసీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+