వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సహకారం లేకుంటే సీమ ప్రజలు బతకలేరు: బైరెడ్డి, జగన్‌పై మధు తీవ్ర వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: తెలంగాణ సహకారం లేకుండా రాయలసీమ ప్రజలు బతకలేరని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురువారం మండిపడ్డారు. వైసిపి అధినేత జగన్ చేస్తున్న దీక్ష వల్ల రాయలసీమకు నష్టం జరుగుతోందన్నారు.

'ప్రత్యేక సీమ ఆత్మహత్యాసదృశ్యం': బైరెడ్డికి ఝలక్, బాబుకు ఊరట'ప్రత్యేక సీమ ఆత్మహత్యాసదృశ్యం': బైరెడ్డికి ఝలక్, బాబుకు ఊరట

డిండి, పాలమూరు ప్రాజెక్టుల పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ ముగ్గురు చర్చించుకొని ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని సూచించారు. దీక్షల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని చెప్పారు.

Telangana Co operation must for Rayalaseema development: Byreddy

జగన్‌పై సిపిఎం మధు తీవ్ర వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధనవంతులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇష్టపడటం లేదని సిపిఎం మధు గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పైన పోరాటాల విషయంలో వైసిపి వెనుకబడిందని చెప్పారు.

కెసిఆర్‌కు ఒక్కడే!, పవన్ కళ్యాణ్ సహా.. బాబుకు వీరి బ్రేక్!!

అదే సమయంలో, ప్రత్యేక హోదా విషయమై కేంద్రం పైన కూడా మధు ధ్వజమెత్తారు. కేంద్రం పైన నమ్మకం పోయిందన్నారు. బిజెపితో దోస్తీ పైన టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. పొత్తుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పారు.

బిజెపితో విడిపోతే ప్రత్యేక హోదా పోరాటంలో తాము తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు సిద్ధమని చెప్పారు. అభివృద్ధి కోసమే పొత్తు అని టిడిపి నేతలు చెప్పారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు.

English summary
Byreddy Rajasekhar Reddy on Thursday said that Telangana Co operation must for Rayalaseema development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X