కొత్త పెన్షన్ల మంజూరు వీరికే, అర్హుల జాబితా - పంపిణీ ఆ రోజు నుంచే..!!
కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ పైన కసరత్తు మొదలు పెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు వేచి చూస్తున్నారు. కాగా, 2026-27 ఆర్దిక సంవత్సరంలో కొత్త గా రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ఇప్పుడు వీరికి అమలు విషయం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పెన్షన్ల మంజూరు పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో రెండు లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 42.23 లక్షల మంది వివిధ కేటగిరీల్లో చేయూత పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతు వులు, ఒంటరి మహిళలు, గీత-చేనేత కార్మికులు, హెచ్ఐవీ బాధితులకు నెలకు రూ.2,016 అందుతోంది. దివ్యాంగులకు మాత్రం రూ.4,016 పింఛన్ ఇస్తున్నారు. కాగా, కొత్త పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్ కోసం మాత్రమే 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. వితంతు, ఒంటరి మహిళలు 3.5 లక్షలు, గీత-చేనేత కార్మికులు 3 లక్షలు, దివ్యాంగు ల విభాగంలో సుమారు 72 వేల దరఖాస్తులు ఉన్నాయి. వీరిలో అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.

జూన్ 2 నుంచి ప్రారంభానికి సన్నాహకాలు
ప్రభుత్వ నిర్ణయం మేరకు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో వివరాలు సేకరిస్తూ.. అర్హతలపై సమీక్ష జరుగుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కఠిన వడపోత ప్రక్రియ చేపట్టనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే.. జూన్ 2 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. తాజాగా అసెంబ్లీలోనూ కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించినవారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 20 నుంచి ప్రజావాణి, ఇతర వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గ్రామసభ ల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో.. వీటిని వడపోత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
భారీగా పెరిగిన యూజర్ ఛార్జీలు, ఇక ఈ సేవలు మరింత భారం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!













Click it and Unblock the Notifications