కెటిఆర్ చొరవ: తెలంగాణలో ఈ పంచాయతీలు
హైదరాబాద్: తెలంగాణలో ఈ పంచాయతీలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2,400 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్ సేవలు కల్పించి ఈ పంచాయతీలుగా రూపుదిద్దాలని నిర్ణయించుకుంది.
వన్ స్టాప్ షాప్ ద్వారా ఈ కార్యక్రమం కింద ఎంజిఎన్ఆర్ఇజిఎస్, పింఛను, వాటర్ షెడ్ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సేవలను అందిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ కార్యదర్శి జె రేమండ్ పీటర్ చెప్పారు.
పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామావు ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారంనాడు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన విస్తృతమైన సమీక్ష నిర్వహించారు.

నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్ (నిక్) బృందం, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఎపిటిఎస్) సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ పంచాయతీల్లో కంప్యూటర్ సర్వీసులు అందిస్తారు. గ్రామ పంచాయతీలు పారదర్శకతకు, నిజాయితీకి దిగువ స్థాయి పాలనవ్యవస్థల్లో పాదులు వేస్తాయని భావిస్తున్నారు. అవి గ్రామస్థాయి సచివాలయాల మాదిరిగా పనిచేస్తాయని పీటర్ చెప్పారు.
పన్ను వసూలు, లేఅవుట్ ఫీజు, జన్మ, మరణ సర్టిఫికెట్ల ఫీజు వసూలు వంటి పలు సేవలను ఈ పంచాయతీలు అందిస్తాయి.












Click it and Unblock the Notifications