తెలంగాణలో పరిస్థితిపై జగన్ ఆరా, నేతలకి దిశానిర్ధేశనం

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ, రానున్న ఎన్నికలలో పోటీపై నేతలకు దిశా నిర్ధేశనం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చాలా రోజుల కిందనే సమైక్యవాదం ఎత్తుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఏం చేయాలో చర్చిస్తున్నారు. ఈ భేటీకి తెలంగాణ ప్రాంతంలోని అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.

YS Jagan

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాదం వినిపించడంతో ఆ పార్టీ తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.

కాని సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన మోసుకోవడంతో చాలామంది మౌనం దాల్చారు. ఇప్పుడు కేంద్రం తెలంగాణ ఇస్తుండటంతో ఇక పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి సారించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో చెప్పుకోదగిన బలం లేనప్పటికీ, పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+