నో డౌట్ ..ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే

ఏపీలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రల్లో నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ సైతం రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయని ప్రకటించాయి. జాతీయ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ..ఎగ్జిట్ పోల్ ఫలితాలు లెక్క ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఎన్నికలు ఉండటంతో ఏపీపై తాను పెద్దగా ఆసక్తి చూపలేదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే నాకు ఏపీలో చాలామంది మిత్రలున్నారని, వారు చెప్పిన లెక్క ప్రకారం తిరిగి వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

telangana minister komatireddy prediction on ap election result

నా కూతుర్ని రాయలసీమకు చెందిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేశానని..వారి కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగుతున్నారని తాను అలా మాట్లాడటం లేదని..నాకున్న సమాచారం ప్రకారం తిరిగి ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగనే అని మరోసారి ఆయన పునర్ఘటించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలo ఆయన్ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని తనకు తెలిసిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి వంటి పలు గొప్ప పథకాలను అందించారని, అందుకే మరోసారి ఏపీ ప్రజలు జగన్‌నే గెలిపిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+