ఏపీ, తెలంగాణలో ఈసారి అధికారం 'చెప్పు'దే!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోకానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈసారి అధికారం 'చెప్పు'దే అని ప్రజలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వాస్తవానికి వేర్వేరు గుర్తులపై పోటీచేయబోయే అభ్యర్థులను ఎన్నుకోవాలనుకున్నప్పటికీ అకస్మాత్తుగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఏపీలో మంత్రులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 'చెప్పు' చూపించారు.

అమ్ముడుబోయాను.. మూడు పెళ్లిల్లు చేసుకున్నాను అంటే 'చెప్పుతో కొడతానంటూ' చెప్పు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా చట్టబద్ధంగానే చేసుకున్నానని, మంత్రుల్లాగ 30 మంది స్టెపినీలు లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి మాట్లాడితే చెప్పుతో కొడతానని, లాక్కొచ్చి కొడతానంటూ నిప్పులు చెరిగారు.

తాజాగా కేటీఆర్ కూడా బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో నిప్పులు కురిపించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బొచ్చు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానని, పరీక్ష చేయించుకోవాలని సవాల్ విసిరారు. లేదంటే కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తినడానికి సిద్ధమేనా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

telangana minister ktr fire on state bjp president bandi sanjay

తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే చెప్పుతో కొడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా కేటీఆర్ మాట తూలరు. ఆయనకు ఆవేశం కూడా రాదు. ఏదడిగినా కూల్ గా సమాధానం చెబుతారు. అటువంటి వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయారంటే అవతలి పక్షం మాటలు ఆయన్ని ఎంత బాధపెట్టాయో అర్థం చేసుకోవచ్చు.

ఏపీలో పవన్ కల్యాణ్ చెప్పుతో కొడతానన్నా, తెలంగాణలో కేటీఆర్ చెప్పుతో కొడతానన్నా వారివైపు తప్పులేదని భావించవచ్చు. కేవలం ఆవేశంలో మాత్రం వారు 'చెప్పు' అనే పదాన్ని ఉపయోగించారు. ఏదేమైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో మాత్రం 'చెప్పు' అందరినీ ఓడించి అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+