పవన్‌కళ్యాణ్‌కు దిమ్మతిరిగింది, ఎన్ని కోట్లిచ్చారు: కవిత

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే దిమ్మ తిరిగిపోయిందని, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయనకు షాకిచ్చే ఫలితాలను తెలంగాణ ప్రజలు ఇచ్చారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు.

మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదన్నారు. ఈ ఎన్నిక్లలో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎన్ని రూపాయలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొన్నాడో చెప్పాలన్నారు.

బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి దీని పైన వివరణ ఇవ్వాలని ఆమె సవాల్ విసిరారు. జగ్గారెడ్డి తరఫున కిషన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమ పైన విమర్శలు చేస్తే సహించేది లేదని టీడీపీ, బీజేపీలను హెచ్చరించారు. టీడీపీ, బీజేపీల కలయిక అనైతికమన్నారు.

ఇప్పటికే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదు.. తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయన్నారు. హైదరాబాదులో గవర్నర్ గిరికి వ్యతిరేకంగా తాము పోరాడామన్నారు. కాగా, మెదక్ ఎన్నికల్లో తమకు ఎవరూ పోటీ కాదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయని, తాము సంస్కరణలు తీసుకు వస్తామని చెప్పారు. ఆయన యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

కవిత

కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాదులో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు.

కవిత

కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెరాస వెంటే ఉన్నారని క్విత అన్నారు. ప్రజలు తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కవిత

కవిత

తెలంగాణ ప్రజలు తెరాసతోనే ఉన్నారని సర్వేతోనే రుజువైందని కవిత అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ మంచి అవకాశాలిచ్చామని, ఉద్యోగ సంఘాల నేతలకు తెరాస ఇచ్చినంత గౌరవం ఎవరు ఇవ్వలేదన్నారు.

కవిత

కవిత

జగ్గారెడ్డికి బీజేపీ తరఫున టిక్కెట్ ఎందుకిచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని, టీడీపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత అన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు తిరస్కరించారన్నారు. పోలవరం, హైదరాబాదు పైన గవర్నర్ పెత్తనం మాట్లాడని నేతలు ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+