హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్దుకుంటాయి: మెట్రోపై కేటీఆర్, త్వరలో ట్రయల్ రన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్ వద్ద మెట్రో రైలు భూగర్భ రైలు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. మెట్రో రైలు నిర్మాణం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. మెట్రో కవర్ గానీ ప్రాంతాల్లో బీఆర్డీఎస్, ఎల్ఆర్టీఎస్ ఉంటుందన్నారు.

మెట్రో రైలును కేవలం 72 కిలోమీటర్లకే పరిమితం చేయమని చెప్పారు. 2040 కల్లా 250 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని చెప్పారు.

Telangana State minister KTR on Metro rail project

మరోవైపు, మెట్రో రైలు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 4,600 కోట్లు ఖర్చయిందని హెచ్ఎంఆర్ డైరెక్టర్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. మెట్రో రైలు పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. చారిత్రక ప్రదేశాలు ఉన్నచోట భూగర్భ రైలు లేదా ప్రత్యామ్నాయం ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వం సూచలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే మెట్రో ట్రయల్ రన్ ఉంటుందన్నారు. ఉగాది రోజున నాగోల్ - మెట్టుగూడ మధ్య సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. మరో నాలుగు బోగీలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. హెచ్ఎంఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు అని చెప్పారు. మెట్రో రైలు నిర్మాణం మాత్రం ఆగదని, చారిత్రక ప్రాంతాలు ఉన్నచోట ప్రత్యామ్నాయాలు చూస్తామన్నారు.

English summary
Telangana state minister KTR on Metro rail project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X