Aghori: ఏపీలో ఎంటరైన అఘోరీ-ఆత్మకూరులో అర్ధరాత్రి కారులో..!
తెలంగాణలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ తర్వాత మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్న అఘోరీ మాత తాజాగా ఏపీలోకి కూడా ఎంటరైంది. తెలంగాణ నుంచి రోడ్డు మార్గంలో కారులో ఏపీలోకి ఆమె ఎంటరైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిన్న అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆమె జనం కంటపడ్డారు. దీంతో కారును జనం వెంబడించారు.
తెలంగాణలో అఘోరీ మాత హల్ చల్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలో అర్ధరాత్రి ఆమె వాడుతున్న కారు కనిపించడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. ఆ కారులో అఘోరీ మాత ఉందని తెలుసుకుని వెంబడించారు. ఫొటోలు తీసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో అఘోరీ కారును ఎక్కడా ఆపకుండా శ్రీశైలం వైపు వెళ్లిపోయారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు అఘోరీ బయలుదేరినట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో ఆమెపై ఎలాంటి కేసులు కానీ వివాదాలు కానీ లేకపోవడంతో ఇక్కడి పోలీసులు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఆత్మకూరులో ఆమె కనిపించిన తర్వాత కొందరు వెంటపడినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అయితే ఇన్నాళ్లూ తెలంగాణలో మాత్రమే కనిపించిన అఘోరీ మాత ఇప్పుడు ఏపీకి కూడా రావడంతో భవిష్యత్తులో ఇక్కడ ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో ఆమెకు ముందు ప్రాధాన్యమిచ్చిన మీడియా, సోషల్ మీడియా వరుస వివాదాలతో పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications