మరో ఫంక్షన్: తుళ్లూరులో పార్టీ ఆవిర్భావ వేడుకలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయిన తుళ్లూరుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలే తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను తుళ్లూరు మండలంలోని అనంతవరంలో జరిపించిన ఆయన, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను కూడా తుళ్లూరులోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు శనివారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతికి చేరుకుంటారు. ఆ తర్వాత తిరుపతి నుంచి పశ్చినగోదావరి జిల్లాలోని పట్టిసీమకు బయలుదేరి శంకుస్ధాపన చేస్తారు.

అనంతరం తుళ్లూరులో జరపాలని నిర్ణంచిని పార్టీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఈ నెల 29 రాత్రి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్తారు. అక్కడ రాజధాని నిర్మాణంపై ఉన్నతస్దాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
ఆ తర్వాత మళ్లీ 31న తిరిగి ఢిల్లీకి చేరుకుని కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్ర ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. శుక్రవారం మండలిలో ఆయన మాట్లాడుతూ ఇన్నేళ్లు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని హఠాత్తుగా వెళ్లాలంటే ఇబ్బందిగానే ఉంటుందన్నారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరులో అద్దె ఇళ్లు దొరికే పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications