ప్రజల నుంచి టిడిపి దూరం...ప్రతిపక్షాల పీకనొక్కే ప్రయత్నం:సిపిఎం మధు
విజయవాడ:ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ దూరమైపోతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు వ్యాఖ్యానించారు. ఇటీవలికాలంలో టిడిపి ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ప్రతిపక్షాల పీకలు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.గుంటూరులో జరిగిన సభలో ముస్లిం మైనార్టీ యువకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదనిప్లకార్డ్ లు ప్రదర్శించినందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని విమర్శించారు.గుంటూరు ఎస్పీ జరిగిన దానిని వైఎస్ఆర్ సిపి కుట్ర అని చెప్పడం దారుణంఅన్నారు.

అధికారులు ఇలా...కరెక్ట్ కాదు
ఎస్పీ ఒక అధికారిగా వుండాలే తప్ప...రాజకీయ నాయకుడిగా ఉండకూడదన్నారు. ముస్లీం యువకులపై ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లయింట్ లో లేని అంశాలను పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఎలా పెడతారని ప్రశ్నించారు. అంతకు ముందు కూడా గుంటూరు లో ముస్లీం యువకులను రెండు నెలల పాటు వేధించారుపోలీసులు, కలెక్టర్...రాజకీయ నాయకుల మాదిరిగా వ్యవహరించకూడదని...జిల్లా ఎస్పీ చేసిన రాజకీయ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని మధు డిమాండ్ చేశారు.

తప్పుడు కేసులు
అధికారులు ఇలా బరితెగించి వ్యవహరించడం సరికాదన్నారు.
పోలీసులు ప్రశ్నించే వారందరనీ అరెస్ట్ చేయడం...తప్పుడు కేసులు పెట్టడం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో మైనారిటీ లు, గిరిజనులు, దళితులకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని...
ఈ వైఖరికి నిరసనగా అన్ని విపక్షాలు కలిసి రాష్ట్ర బంద్ కు సైతం పిలుపునిస్తామని వెల్లడించారు.
ముస్లిం మైనారిటీ యువకులు ప్లకార్డులు చూపితేనే... వారిని రౌడీలుగా చూపుతారా?...
ప్రతి విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది...కాని
దానిని ఎవరైనా ఎత్తిచూపితే...పోలీసులను ప్రయోగిస్తున్నారని సిపిఎం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ది
వామపక్షాలే కాదు... దళితులు.. ముస్లింలు.. రైతులు...చివరికి సామాన్యులపై కూడా కేసులు పెట్టడం...దమనకాండ కొనసాగించడం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై యుద్దం చేస్తోందని...
ఉండవల్లి లో రైతుల అనుమతి లేకుండా విద్యుత్ వైర్లు ఎలా వేస్తారని నిలదీశారు. వాటిని అడ్డుకున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమని...
ఇది దుర్మార్గమైన ప్రభుత్వమని చెప్పారు. ఇదేనా చంద్రబాబు అభివృద్ధి? అని ప్రశ్నించారు....ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు.

ప్రజాస్వామిక హక్కులు...మోడీ దాడి
ప్రస్తుతంప్రజాసమస్యలపై జనసేనతో వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని...పొత్తుల విషయం ఎన్నికల సమయంలోనే ఆలోచిస్తామన్నారు.
వరవరరావుని అరెస్ట్ చేయడంపై స్పందించిన మధు వరవరరావుతో పాటు పలువురు మేధావుల అరెస్ట్ లను ఖండిస్తున్నామన్నారు.
ఇది ప్రజాస్వామిక హక్కులపై నరేంద్ర మోదీ చేస్తున్న దాడిగా సిపిఎం మధు అభివర్ణించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications