చంద్రబాబుతో భేటీ: టిడిపిలోకి సినీ నటుడు జీవీ
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు జీవీ సుధాకర్ నాయకుడు తెలుగుదేశంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయన మంగళవారంనాడు చంద్రబాబును కలిశారు. స్వస్థలం కావడంతోపాటు తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న విశాఖ నగరంలోని గాజువాక అసెంబ్లీ సీటును తనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తనకు సామాజిక సేవ, రాజకీయ రంగంపై ఆసక్తి ఉందని, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు నాకు ఆహ్వానం వచ్చినా చేరలేదని జీవీ చెప్పారు. తెలుగుదేశం మీదనే తనకు ఆసక్తి ఉందని అన్నారు. భూకబ్జాదారులు, అవినీతిపరులపై పోరాటం చేయాలని, సామాన్య ప్రజలకు సేవ చేయాలని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఆ పోరాటం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పారు. తన అభ్యర్థనను పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి పలువురు కాంగ్రెసు నాయకులు ఉవ్వీళ్లూరుతున్న సమయంలో జీవీ సుధాకర్ నాయుడు కూడా అందుకు సిద్ధపడ్డారు.
జీవీ సుధాకర్ నాయుడు రెండు సినిమాలకు దర్సకత్వం కూడా వహించారు. హీరో, రంగ ది దొంగ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు.












Click it and Unblock the Notifications