ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు; ధైర్యం చెప్పిన చంద్రబాబు; రంగంలోకి టీడీపీ ఎన్నారై సెల్
ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో రష్యా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ఇక టీడీపీ కూడా ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి దిగింది.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి ఎన్నారై టిడిపి సెల్
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగువారి అందరికీ ఎన్నారై టిడిపి సెల్ కూడా అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు, తెలుగు వారికి సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఎన్నారై టిడిపి సెల్ హాట్ లైన్ నెంబర్ +91 8645350888 కు కాల్ చేయవచ్చని, లేదా nritdpservicesgmail.com ఈ మెయిల్ చేసి సహాయం పొందవచ్చు అని పేర్కొన్నారు.

జూమ్ ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన చంద్రబాబు
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు విద్యార్థులంతా ఒక చోట ఐక్యంగా, తటస్థంగా ఉండడం ఎంతో మంచిదని ఆయన సూచించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని, సమయస్ఫూర్తితో నడుచుకోవాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. పాస్ పోర్ట్ తో పాటు ఇతర ఆధారాలను ఎప్పుడూ తమ వెంటే ఉంచుకోవాలని సూచించారు.

సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను టీడీపీ ఎన్నారై సెల్ తీసుకుంటుంది: టీడీపీ చీఫ్
టిడిపి ఎన్నారై సెల్ వారికి కావలసిన సహాయం అందిస్తుందని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చే బాధ్యతను టీడీపీ ఎన్నారై సెల్ తీసుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజులు ఎంతో కీలకమని, పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారికి అండగా తామంతా ఉన్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కార్
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారి కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా ఏపీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. 1902 కి కాల్ చేసి విద్యార్థులు తమ వివరాలు చెప్పాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అక్కడకు విద్యార్థులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దాదాపు వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్టు వెల్లడించారు. వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications