బీపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు గుడ్ న్యూస్: వైద్యవిద్యలో నేషనల్ పూల్ లోకి తెలుగు రాష్ట్రాలు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ అమరావతి: ఇప్పటి వరకు వైద్యను అభ్యసించాలని భావించే తెలుగు విద్యార్థులకు అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ 2017 - 18 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష 'నీట్' నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయంతో ఎంబీబీబీఎస్ ఆకాంక్ష పరులైన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. జాతీయ స్థాయి పరీక్ష అయినా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జమ్ము కశ్మీర్‌లో మాత్రమే అడ్మిషన్లకు అవకాశం ఉండేది. దీనికి కారణం ఉన్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంత వాసుల అవకాశాలకు నష్టం వాటిల్లకుండా 1970వ దశకంలో కేంద్రం.. రాజ్యాంగంలో '371 డి' అధికరణం చేర్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కోర్సుల అడ్మిషన్లు ఇదే రాష్ట్రానికి పరిమితం చేశారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక 371డీ అవసరంపై ప్రశ్నించిన న్యాయస్థానాలు

తెలంగాణ ఏర్పాటయ్యాక 371డీ అవసరంపై ప్రశ్నించిన న్యాయస్థానాలు

కానీ సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో తెలంగాణ కల సాకారమైంది. అదే ఏడాది నుంచే తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లో స్థానికేతర కోటాలో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్థానికేతర కోటాలో అడ్మిషన్లు జరిగాయి. స్థానికేతర కోటాలో 15 శాతం మందికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 2017 - 18లో వైద్య విద్యా పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో జాతీయస్థాయి స్థానికేతర కోటా కోసం ఒక విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ‘371డీ' అధికరణం అమలు చేయాల్సిన అవసరమేమిటని న్యాయస్థానాలు ప్రశ్నించాయి.

 నేషనల్ పూల్‌లో చేరేందుకు ఏపీ సర్కార్ ఓకే

నేషనల్ పూల్‌లో చేరేందుకు ఏపీ సర్కార్ ఓకే

నేషనల్ పూల్‌లో స్థానికేతర కోటాలో రమారమీ 12 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం సూచన మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య విద్యా కోర్సుల్లో నేషనల్ పూల్‌లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఏళ్ల తరబడి డిమాండ్‌ చేస్తున్న ‘నేషనల్‌ పూల్‌' అంశానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ను నేషనల్‌ పూల్‌లోకి తీసుకెళ్లడానికి స్వయంగా సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. నేషనల్‌ పూల్‌లోకి రావాల్సిందిగా ఇప్పటికే కేంద్రం ఏపీ, తెలంగాణలను కోరడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై సృష్టత ఇచ్చింది.

 తెలంగాణతో సంప్రదించనున్న ఏపీ సర్కార్

తెలంగాణతో సంప్రదించనున్న ఏపీ సర్కార్

ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు అదనంగా 10,800 ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు దక్కుతాయి. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నేషనల్‌ పూల్‌లో లేకపోవడం వల్ల ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైద్య సీట్లు తప్ప, బయట రాష్ట్రాల్లోని సీట్లను విద్యార్థులు దక్కించుకోలేకపోయారు. దీనివల్ల కొన్నేళ్లుగా తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇక, తాజా నిర్ణయంతో వైద్య విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు ఒకేసారి కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని ఏపీ యోచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.

 ఇతర రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి లోపు సీట్లు

ఇతర రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి లోపు సీట్లు

ఏపీలో ప్రస్తుతం 4000, తెలంగాణలో 2500 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. పీజీలో సుమారు 2000 సీట్లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నేషనల్‌ పూల్‌లో లేకపోవడం వల్ల లక్షల్లో ఉన్న తెలుగు విద్యార్థులు ఉన్న సీట్లుతోనే సర్దుకోవాల్సి వస్తోంది. అయితే, రెండు రాష్ట్రాలు నేషనల్‌ పూల్‌లో ఉండటం వల్ల సీట్లు 11 రెట్లు పెరుగుతాయిని అధికారులు అంచనా వేశారు. ఏపీ విషయానికి వస్తే మన 15% సీట్లు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. అదేసమయంలో ఏపీ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సీటు పొందే అవకాశం ఉంటుంది. ఏపీలో 400 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయిస్తే దేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 4157కిపైగా ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

 తెలంగాణ అంగీకరించిందన్న ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్

తెలంగాణ అంగీకరించిందన్న ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 600 పీజీ సీట్లు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయిస్తే దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో ఏపీ అభ్యర్థులకు అవకాశం లభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు నేషనల్‌ పూల్‌ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, పీజీ వైద్య సీట్ల భర్తీలో నేషనల్‌ పూల్‌లోకి చేరాలని తెలుగు రాష్ట్రాలను కేంద్రం కోరిందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పూల్‌లో చేరేందుకు అంగీకరించిందని మంగళవారం మీడియాతో చెప్పారు. నేషనల్‌ పూల్‌లో చేరేందుకు విభజన చట్టంలోని 317డీ అడ్డుకాబోదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Good news for Telugu states MBBS aspirant students. Union Government invited Telangana and Andhra Pradesh statements to joining to national pool for MBBS, BDS and PG medical courses. It will be implemented from 2018 - 19 academic educational year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి