ఎన్ కౌంటర్: తమిళ-తెలుగు ఐక్యతకు దెబ్బ..!
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రతినిధిలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌ను వారు కలుసుకొని, పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ వల్ల తమిళనాడులో తమిళ, తెలుగు ప్రజల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సుహృద్భావ వాతావరణం చెదిరిపోయి, విద్వేషాలు చెలరేగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 20 మంది తమిళ కూలీలు మరణించారు.

ఈ ఎన్‌కౌంటర్ కాల్పులు అటు తమిళ ప్రజలనే కాకుండా ఇటు తెలుగు ప్రజనలు కూడా కలచివేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నివసించే తెలుగు ప్రజలందరూ ఈ ఎన్ కౌంట్‌ను ముక్త కంఠంతో ఖండించారు కూడా. తమిళనాడు ప్రభుత్వం కూడా దీన్ని సామూహిక అత్యాకాండగా పరిగణించి ఎన్‌కౌంటర్ అనే వాదనను తోసి పుచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవలే తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సు సర్వీసులని తిరిగి పునరుద్ధరించింది. చిత్తూరు శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొంత కాలంగా తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు చేయడంతో, ఏపీఎస్‌ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications