వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటే

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ శుక్రవారం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఎక్కడైనా చక్రం తిప్పగల నాయకుడు అన్నారు. ఆయన దేశాన్ని నడిపిన రోజులు ఉన్నాయన్నారు.

బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?

టీడీపీ ఎంపీలు, మంత్రులు, సీనియర్ నాయకులు చాలామంది బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీతోనే ఉంటే మనకు మొదటికే మోసం వస్తుందని, కాబట్టి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుందామని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేష్ స్పందించారు. ఇప్పటి వరకు ప్రేమతో రాబట్టాల్సింది అంతా రాబట్టామని చెప్పారు.

 చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దు

చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దు

టీడీపీ అధినేత చంద్రబాబును ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని టీజీ వెంకటేష్ అన్నారు. సానుకూల ధోరణితో కేంద్రం నుంచి నిధులు సాధించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే చివరకి మనకు మిగిలేది చిప్పేనని అన్నారు.

అంచెలంచెలుగా పోరాటం

అంచెలంచెలుగా పోరాటం

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం కోసం పార్లమెంటు లోపలా, వెలుపలా పోరాటం చేస్తామని టీజీ వెంకటేష్ చెప్పారు. కానీ కేంద్రంతో పోరు మాత్రం ఏమాత్రం సరికాదని చెప్పారు. అంచెలంచెలుగా కేంద్రంపై పోరాటం చేసి అన్నీ సాధించే ప్రయత్నం చేస్తామని అభిప్రాయపడ్డారు.

 చివరి ప్రక్రియగా తెగదెంపులు, జగన్‌పై ఇలా

చివరి ప్రక్రియగా తెగదెంపులు, జగన్‌పై ఇలా

చివరి ప్రక్రియగా మాత్రమే తెగదెంపులు ఉంటుందని టీజీ వెంకటేష్ చెప్పారు. కేంద్రంతో తెగదెంపులు తమ పార్టీ (తెలుగుదేశం) తెగదెంపులు చేసుకుంటే లబ్ధి పొందాలని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు.

పూర్తి మెజార్టీ ఉన్నందున మిత్రపక్షాలు ఏం చేయలేవు

పూర్తి మెజార్టీ ఉన్నందున మిత్రపక్షాలు ఏం చేయలేవు

చంద్రబాబు గతంలో దేశాన్ని అనుకున్న విధంగా నడిపిన రోజులు ఉన్నాయని టీజీ వెంకటేష్ చెప్పారు. తెలివైన వారు మొదట తగాదా పెట్టుకోరని చెప్పారు. ప్రేమతోనే నిధులు సాధించుకోవాలని చెప్పారు. బీజేపీ పూర్తి మెజార్టీ ఉన్నందున మిత్రపక్షాలు ఏం చేయలేవన్నారు. చంద్రబాబు అంచలంచెలుగా పోరాటాన్ని నిర్ణయిస్తారని చెప్పారు.

 బీజేపీకి ఎదురుదెబ్బలు, జీఎస్టీ తెచ్చిన ప్రభుత్వాలు కూలిపోయాయి

బీజేపీకి ఎదురుదెబ్బలు, జీఎస్టీ తెచ్చిన ప్రభుత్వాలు కూలిపోయాయి

దేశంలో వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలాయని టీజీ వెంకటేష్ అన్నారు. ప్రపంచంలో జీఎస్టీ తెచ్చిన ప్రభుత్వాలు కూలిపోయాయని చెప్పారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందున మిత్రపక్షాలు ఏం చేయలేవని చెప్పారు. మెజార్టీ ఉందన్న పొగరుతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 ఇక హోదా అడుగుతాం

ఇక హోదా అడుగుతాం

ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అన్నారని, ఆ మాట బీజేపీ నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కాబట్టి మేం మళ్లీ హోదా అడుగుతామని టీజీ వెంకటేష్ తేల్చి చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటకలలో ఇలా కావాల్సిన చోటల్లా నిధులు ఇచ్చుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

రెండంచెల వార్

రెండంచెల వార్

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని టీజీ వెంకటేష్ ఆరోపించారు. కేంద్రంపై తొలి వార్‌గా టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని చెప్పారు. రెండో వార్‌గా ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. అంచెలంచెలుగా పోరాటాన్ని చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. ఆదివారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, మిత్రపక్షాలను లెక్కచేసే స్థితిలో లేవని టీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో రెండు పార్టీలకు పాత్ర ఉందని, హామీలను నానుస్తూ వస్తున్న బీజేపీ మరింత అన్యాయం చేస్తోందన్నారు. హోదా, రైల్వే జోన్ ఇస్తారనే నమ్మకంతో బీజేపీపై ప్రేమను పెంచుకున్నామన్నారు.

English summary
TG Venkatesh responds on Union Budget 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X