నా వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్: చైనాలో బాబు
బీజింగ్: తన పని తీరు వల్లే తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చైనాలో వ్యాపారవ్తేతల సమావేశంలో అన్నారు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు మూడోరోజు అయిన మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం బీజింగ్‌లో వ్యాపారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు.
ఉదయమే చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. భారత్‌లో వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని కంపెనీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బృందానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధికి తగిన సహకారం అందజేస్తామన్నారు.

పోర్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. ఏపీలో తాము అభివృద్ధి చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై సవివర నివేదికలను రూపొందిస్తున్నట్లుగా చైనా హార్బర్ కంపెనీ చైర్మన్ తెలిపారు.
ఏపీలో కొత్త రాజధానిలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు వారిని కోరారు. ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆ తరువాత జిగుహుబా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గిజిహూ కంపెనీతో ఓ ఎంవోయూను ప్రభుత్వం కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications