అడ్డంగా: టిపై బాబు, బాలయ్యనంటావా: షర్మిలపై లోకేష్

ఒంగోలు/చిత్తూరు: రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం వ్యాఖ్యానించారు. ఆయన ప్రకాశం జిల్లా గిద్దలూరు సభలో ప్రసంగించారు. అడ్డంగా విభజన అన్యాయమన్నారు. అవినీతి పార్టీలను తరిమి కొట్టాలని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు.

తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని దుయ్యబట్టారు. నదుల అనుసంధానంతో చివరి భూముల వరకు నీరు అందిస్తామని చెప్పారు. రైతులు ఇబ్బందులలో ఉన్నారనే తాను రుణమాఫీని చేస్తాని చెబుతున్నానన్నారు.

Telugudesam Party chief Nara Chandrababu blames Congress for AP division

మహిళలకు రుణాలు మాఫీ చేస్తాన్నారు. పేదలకు ఎన్టీఆర్ హెల్త్ కార్డులు ఇచ్చి, ఉచిత ఆరోగ్య సేవ అందిస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పేదలకు ఉచిత ఇళఅలు కట్టిస్తామని చెప్పారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో టిడిపి వస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

షర్మిలపై మండిపడ్డ లోకేష్

టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిల పైన నిప్పులు చెరిగారు. తన మావయ్య బాలకృష్ణను విమర్శించే అర్హత షర్మిలకు లేదన్నారు. నాలుగు వందల ట్రక్కుల్లో కల్తీ సారా వస్తోందని, దానిని పట్టుకొని కార్యకర్తలు పోలీసులకు అప్పగించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+