మూడునెలల పాటు నిప్పుల కుంపటిలా దేశం.. వేసవి ఎద్దడి, కరువుకు ఛాన్స్; హెచ్చరించిన డబ్ల్యూఎంఓ!!

వేసవికాలం ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇక భారతదేశంలో, అందునా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటినుంచి మే నెల చివరిదాకా ఎండలు నిప్పుల కొలిమిలా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు నెలలు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ డబ్ల్యూ ఎం ఓ తాజాగా వెల్లడించింది.

పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం ఎల్ నినో ప్రభావం తోపాటు, వాతావరణం లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ హెచ్చరించింది. గత ఏడాది జూన్లో ఎల్ నినో ఏర్పడిన నాటి నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది.

Temperatures very high in this summer Chance of drought in India WMO warning

ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ లు పెరుగుతాయి. పసిఫిక్ మహాసముద్రంపైన నీళ్ళు వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. ఇది ఏర్పడిన సంవత్సరాలలో వాతావరణంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా దక్షిణ అమెరికా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయి, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.

ఎల్ నినో రెండు నుంచి ఏడు ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. గతంలో 2015 - 2016 లో ఈ పరిస్థితులు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు దాదాపు 9 నెలల నుంచి 12 నెలల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత ఫసిపిక్ మహా సముద్ర జలాలు చల్లారే లా నినా ఏర్పడే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ పేర్కొంది.

ఏది ఏమైనా ఈసారి ఎండలు మండుతాయి అని పదేపదే చెబుతున్న వాతావరణ సంస్థలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎల్ నినో పరిస్థితుల కారణంగా కరువు వచ్చే అవకాశం ఉన్నందున, దానిని ఎదుర్కొనే విధంగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని వాతావరణ సంస్థలు నొక్కి చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+